కనీస మద్దతు ధర తీసేస్తే రాజీనామా చేస్తా: డిప్యూటీ సీఎం

కనీస మద్దతు ధర తీసేస్తే రాజీనామా చేస్తా: డిప్యూటీ సీఎం

చండీగఢ్: కనీస మద్దతు ధరను కాపాడుకుంటానన్న తన హామీని నిలబెట్టుకోకపోతే పదవి నుంచి తప్పుకుంటానని హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా చెప్పారు. జననాయక్ జనతా పార్టీ నేత అయిన దుష్యంత్ ఎంఎస్‌పీపై లిఖిత పూర్వక హామీ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని గురువారం పేర్కొన్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి కనీస మద్దతు ధర గురించి దుష్యంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘మా పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎంఎస్‌‌పీ కొనసాగింపుపై రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ మేరకు కేంద్రం కూడా ఎంఎస్‌‌పీని కొనసాగిస్తూ రైతులకు లిఖితపూర్వక ప్రతిపాదనలు పంపింది. నేను డిప్యూటీ సీఎంగా ఉన్నంత కాలం ఎంఎస్‌‌పీని కాపాడేందుకు కృషి చేస్తా. అలా కాని పక్షంలో నేను రాజీనామా చేస్తా’ అని దుష్యంత్ పేర్కొన్నారు.