హర్యానాలో ఎన్నికల నగారా మోగింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించింది సీఈసీ. హరియాణాలో 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనున్నట్లు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా..అక్టోబర్ 4న కౌంటింగ్ జరగనుంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్
- గెజిట్ నోటిఫికేషన్: సెప్టెంబర్ 5 , 2024
- నామినేషన్స్ దాఖలు : సెప్టెంబర్ 12
- నామినేషన్ పరిశీలన: సెప్టెంబర్ 13
- నామినేషన్ విత్ డ్రా చివరి తేది: సెప్టెంబర్16
- ఎన్నికల పోలింగ్ తేది: అక్టోబర్ 01
- ఫలితాల కౌంటింగ్: అక్టోబర్ 4
- హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ నియోజకవర్గాలు
- 73 జనరల్, ఎస్సీ-17
- మొత్తం 2.01 కోట్ల మంది ఓటర్లు
- 1.06 కోట్ల పురుషులు
- 95 లక్షల మంది మహిళలు
- మొదటి సారి ఓటు హక్కు వినియోగించుకునే వారు 4.52 లక్షల మంది
- 40.95 లక్షల మంది యువ ఓటర్లు
