Xలో వీడియో లింక్ కాపీ ఆప్షన్ తీసేశారా ? అసలు నిజమేంటంటే..

Xలో వీడియో లింక్ కాపీ ఆప్షన్ తీసేశారా ? అసలు నిజమేంటంటే..

మీరు  X (ట్విట్టర్) వాడుతున్నప్పుడు.. వీడియో లింక్ కాపీ చేసే ఆప్షన్ కనిపించడం లేదని అనుకున్నారా..? లేదా మీకు అలా అనిపించిందా ? అయితే మీరు ఒక్కరే కాదు, చాలా మంది  ఇలాగే కన్ఫ్యూజ్ అయ్యారు. ఎలాన్ మస్క్  Xలో వీడియో లింక్ కాపీ చేసే ఫీచర్‌ను తీసేశారని సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అయ్యింది. కానీ, అసలు విషయం ఏంటంటే....

ఈ కన్ఫ్యూజన్ అంతా ఏప్రిల్ ఫూల్స్ డే అంటే ఏప్రిల్ 1న ఎవరో సరదాగా చేసిన పని వల్ల మొదలైంది. Xలో ఇకపై వీడియో లింకులు కాపీ చేయడం కుదరదు, కొత్త అప్‌డేట్ వచ్చింది అని కొన్ని అకౌంట్ల నుంచి పోస్టులు పడ్డాయి. అవి ఎంతలా వైరల్ అయ్యాయంటే.. కొన్ని పోస్టులకు ఏకంగా 40 లక్షల నుండి 70 లక్షల వరకు వ్యూస్ వచ్చాయి. దీంతో అందరూ అది నిజమేనని నమ్మేశారు.

నిజం ఏంటంటే 
  Xలో అలాంటి మార్పు ఎం జరగలేదు. వీడియో లింక్ కాపీ చేసే ఫీచర్ ఇప్పటికీ అలాగే ఉంది. మీరు ఎప్పటిలాగే పోస్ట్ కింద ఉండే షేర్   బటన్ నొక్కి, కాపీ లింక్  ఆప్షన్ ద్వారా లింక్ తీసుకోవచ్చు. కంప్యూటర్ వాడేవారు వీడియోపై రైట్ క్లిక్ చేసి కూడా లింక్ కాపీ చేసుకోవచ్చు.

అయితే వీడియోలు ఆటోమేటిక్‌గా ప్లే అవ్వడం లేదా యాప్‌లో వచ్చే చిన్న చిన్న మార్పుల వల్ల ఆ ఆప్షన్ ఎక్కడో పోయిందని యూజర్లు పొరబడ్డారు. దీనికి తోడు ఏప్రిల్ 1 కావడంతో ఈ ఫేక్  వార్త వైరల్ గా వ్యాపించింది. ఆ తర్వాత నిజం తెలుసుకున్న నెటిజన్లు.. లింక్ కాపీ అవుతోంది, ఎం మారలేదు అని క్లారిటీ ఇవ్వడం మొదలుపెట్టారు.