మల్టీ లేయర్ స్క్రీన్‌‌‌‌ప్లేతో కిల్లర్ మూవీ..

మల్టీ లేయర్ స్క్రీన్‌‌‌‌ప్లేతో కిల్లర్ మూవీ..

జ్యోతి పూర్వజ్,  మనీష్  గిలాడ లీడ్ రోల్స్‌‌‌‌లో పూర్వజ్ దర్శకత్వం వహిస్తూ పద్మనాభ రెడ్డితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కిల్లర్’.  త్వరలో  థియేట్రికల్ రిలీజ్‌‌‌‌కు రాబోతోంది. ఆదివారం టీజర్‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌‌‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతి పూర్వజ్ మాట్లాడుతూ ‘సీరియల్స్‌‌‌‌లో  రొటీన్ క్యారెక్టర్స్ చేస్తూ విసిగిపోయిన నేను.. ఆరేడు క్యారెక్టర్స్  ఉన్న ఇలాంటి మూవీ చేస్తానని అనుకోలేదు.  విజయశాంతి గారిలా యాక్షన్ చేయాలని నాకూ డ్రీమ్ ఉండేది. అలాంటి అవకాశం ఈ  చిత్రంతో దక్కింది. పూర్వజ్ ఇచ్చిన సపోర్ట్‌‌‌‌తోనే నేను ఈ సినిమా చేయగలిగాను’ అని చెప్పారు. 

ఈ చిత్రంలో తాను పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ విలన్ రోల్‌‌‌‌లో కనిపించనున్నట్టు మనీష్ గిలాడ చెప్పాడు.  డైరెక్టర్ సుకు పూర్వాజ్ మాట్లాడుతూ ‘వుమెన్ సెంట్రిక్ చిత్రమిది.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎమోషనల్ డ్రామా, బ్రదర్ సిస్టర్ బాండింగ్, రివేంజ్, సబ్‌‌‌‌కాన్షియస్ ఐడెంటిటీ.. ఇలాంటి ఎలిమెంట్స్‌‌‌‌తో సైఫై థ్రిల్లర్‌‌‌‌‌‌‌‌గా ఈ సినిమాను రూపొందించాం. 

మల్టీ లేయర్ స్క్రీన్‌‌‌‌ప్లే  ఉన్నా  ప్రతి సెక్షన్ ఆడియెన్‌‌‌‌కు ఈజీగా అర్థమయ్యేలా మూవీ ఉంటుంది.  మమ్మల్ని సపోర్ట్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి గారికి మా అందరి తరుపున థ్యాంక్స్ చెబుతున్నా’ అని అన్నారు. నటులు  గౌతమ్ చక్రధర్, విశాల్ రాజ్,  శ్రీనివాస్,  చందు,  కాళీచరణ్ పాల్గొన్నారు.