హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు

హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ హవాలా డబ్బు

హైదరాబాద్ : హైదరాబాద్ లో హవాలా డబ్బు భారీగా పట్టుబడుతోంది. రెండు రోజుల వ్యవధిలో రూ. 4 కోట్ల నగదును పోలీసులు సీజ్ చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఒక్కరోజే వెస్ట్ జోన్ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు రెండున్నర కోట్ల హవాలా నగదును సీజ్ చేశారు. ఈ కేసులో ముగ్గురిని అదుపులోకి తీసుకుని.. జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు. రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్ వెంకటగిరికాలనీలో రూ.54 లక్షల హవాలా నగదును సీజ్ చేశారు. 

హవాలా డబ్బును ఎక్కడకు తరలిస్తున్నారు..? ఎందుకు తరలిస్తున్నారు..? ఇంకా హవాలా డబ్బు ఉందా..? ఒకవేళ ఉంటే ఎక్కడ దాచారు..? దీని సూత్రధారులు ఎవరు..? అనే విషయాలపై ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. తమ అదుపులో ఉన్న వారిని లోతుగా విచారిస్తున్నారు.