హెచ్‌‌‌‌‌‌‌‌సీఏలో అవినీతిని అంతం చేస్తం

హెచ్‌‌‌‌‌‌‌‌సీఏలో అవినీతిని అంతం చేస్తం
  • క్రికెట్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధే మా ఎజెండా
  • ఎలక్షన్స్​లో గుడ్‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌ ప్యానెల్ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ హామీ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: కొన్నేండ్లుగా అవినీతిలో కూరుకుపోయిన హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ క్రికెట్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ (హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ)ను గాడిలో పెట్టి క్రికెట్‌‌‌‌‌‌‌‌ను అభివృద్ధి చేస్తామని హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ ఎన్నికల్లో పోటీ చేస్తున్న గుడ్‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌ ప్యానెల్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ తెలిపారు. తాము అధికారంలోకి రాగానే అవినీతిని అంతం చేసి, అసోసియేషన్‌‌‌‌‌‌‌‌కు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. 

ప్రతీ జిల్లాకు హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ చేరువయ్యేలా డీసెంట్రలైజేషన్‌‌‌‌‌‌‌‌ కాన్సెప్ట్‌‌‌‌‌‌‌‌ను అమలు చేస్తామని మంగళవారం తమ ప్యానెల్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌తో నిర్వహించిన మీడియా సమావేశంలో  ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌ పోటీదారు  అనిల్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.  ‘ప్రస్తుతం హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. అసోసియేషన్‌‌‌‌‌‌‌‌కు క్రికెట్‌‌‌‌‌‌‌‌, సభ్యులు ( క్లబ్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీలు) రెండు కండ్లు. కానీ, ఈ రెండింటినీ విస్మరించారు. 

టీమ్‌‌‌‌‌‌‌‌ సెలక్షన్స్‌‌‌‌‌‌‌‌ను అవినీతి మయం చేశారు. సంఘాన్ని ఈ స్థాయికి దిగజార్చిన  వాళ్లే ఇప్పుడు కొత్త మొఖాలను ముంగట పెట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారు. మా ప్యానెల్‌‌‌‌‌‌‌‌ వెనుక రాజకీయ పార్టీలు, వ్యక్తులు ఎవ్వరూ లేరు. క్రికెట్‌‌‌‌‌‌‌‌అభివృద్ధే ఎజెండాగా, మంచి పరిపాలన అందించేందుకే  మేమంతా ముందుకొచ్చాం. అందుకే మా ప్యానెల్‌‌‌‌‌‌‌‌కు గుడ్‌‌‌‌‌‌‌‌ గవర్నెన్స్‌‌‌‌‌‌‌‌ అని పేరు పెట్టుకున్నాం’ అని అనిల్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు. తమ ప్యానెల్‌‌‌‌‌‌‌‌ మ్యానిఫెస్టోను వెల్లడించారు. ఈ నెల 20న జరిగే ఎన్నికల్లో తమ ప్యానెల్‌‌‌‌‌‌‌‌ కచ్చితంగా గెలుస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు.

జిల్లాల్లో స్టేట్​ మ్యాచ్​లు నిర్వహిస్తాం: ఆగం రావు

సుదీర్ఘ చరిత్ర ఉన్న  హెచ్‌‌‌‌‌‌‌‌సీఏ -కొంతకాలంగా హైదరాబాద్‌‌‌‌‌‌‌‌కి మాత్రమే పరిమితం అయిందని, గత పాలకులు జిల్లాలను పూర్తిగా విస్మరించారని సెక్రటరీ అభ్యర్థి ఆగం రావు అన్నారు. తాము గెలిస్తే రాష్ట్రమంతటా క్రికెట్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధి చేస్తామని చెప్పారు. ప్రతీ జిల్లాలో క్రికెట్‌‌‌‌‌‌‌‌ స్టేడియాలను నిర్మించి, స్టేట్‌‌‌‌‌‌‌‌ లెవెల్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లను అక్కడ నిర్వహిస్తామన్నారు. 

లోకల్‌‌‌‌‌‌‌‌ టాలెంట్‌‌‌‌‌‌‌‌ను ఎంకరేజ్‌‌‌‌‌‌‌‌ చేసేందుకు  తెలంగాణ ప్రీమియర్ లీగ్‌‌‌‌‌‌‌‌ను తిరిగి ప్రారంభిస్తామన్నారు. ‘గత కొన్నేండ్లు అధికారం చెలాయించిన  కొందరు మెంబర్స్‌‌‌‌‌‌‌‌ హెచ్‌‌‌‌‌‌‌‌సీఏకు ఓనర్లుగా భావిస్తున్నారు. - బీసీసీఐ నుంచి వస్తున్న నిధులను స్వాహా చేయడంతో పాటు ప్లేయర్ల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడ్డారు. 

మేం గెలిస్తే బీసీసీఐ నుంచి హెచ్‌‌‌‌‌‌‌‌సీఏకు అదనంగా నిధులు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. ఎక్కడా అవినీతికి తావు లేవుకుండా ప్రతీ విషయాన్ని ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో నమోదు చేస్తాం. గతంలో అన్ని జిల్లాల క్రికెటర్లకు అవకాశం లభించేలా నిర్వహించిన వెంకటస్వామి మెమోరియల్‌‌‌‌‌‌‌‌ టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌తో తిలక్‌‌‌‌‌‌‌‌  వర్మ వంటి క్రికెటర్లు వెలుగులోకి వచ్చారు. మేం అధికారంలోకి రాగానే టీ20 లీగ్‌‌‌‌‌‌‌‌ను రీస్టార్ట్‌‌‌‌‌‌‌‌ చేస్తాం’ అని ఆగం రావు చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్యానెల్ పోటీదారులు దల్జీత్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ ( వైస్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌), బసవరాజ్​ (జాయింట్‌‌‌‌‌‌‌‌ సెక్రటరీ), మహేంద్ర (ట్రెజరర్‌‌‌‌‌‌‌‌), వినోద్‌‌‌‌‌‌‌‌ ఇంగ్లే (కౌన్సిలర్‌‌‌‌‌‌‌‌) పాల్గొన్నారు.

ఇండియా ఫ్యాన్స్‌‌పై ఐసీసీకి పాక్‌‌ ఫిర్యాదు

లాహోర్‌‌‌‌: టీమిండియా అభిమానులపై ఐసీసీకి పాకిస్తాన్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ బోర్డు (పీసీబీ) ఫిర్యాదు చేసింది. వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా శనివారం ఇండియా–పాకిస్తాన్‌‌‌‌ మధ్య అహ్మదాబాద్‌‌‌‌ వేదికగా జరిగిన మ్యాచ్‌‌‌‌లో తమ ఆటగాళ్ల పట్ల ఫ్యాన్స్‌‌‌‌ అనుచితంగా వ్యవహరించారని ఫిర్యాదులో పేర్కొన్నది. అలాగే, టోర్నీకి హాజరయ్యేందుకు  పాక్‌‌‌‌ జర్నలిస్టులకు వీసాలు ఆలస్యం అవ్వడం, తమ ఫ్యాన్స్‌‌‌‌కు వీసాలు రాకపోవడంపైనా ఐసీసీకి నిరసన తెలియజేసింది. 

ఇండియా చేతిలో ఓటమి తర్వాత పాక్‌‌‌‌ హెడ్‌‌‌‌ కోచ్ మిక్కీ ఆర్థర్ స్టాండ్స్‌‌‌‌లో పాకిస్తాన్ మద్దతు లేకపోవడం వల్ల  ఈ వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ బీసీసీఐ ఈవెంట్‌‌‌‌లా ఉందని వ్యాఖ్యానించిన తర్వాత పీసీబీ అధికారిక ఫిర్యాదు చేయడం గమనార్హం. కాగా, టీమిండియా గ్రాండ్‌‌‌‌ విక్టరీ సాధించిన మ్యాచ్‌‌‌‌లో పాకిస్తాన్ ఆటగాళ్లను ఉద్దేశిస్తూ  స్టాండ్స్‌‌‌‌లోని ఫ్యాన్స్‌‌‌‌  మత నినాదాలు చేసిన వీడియోలు సోషల్‌‌‌‌ మీడియాలో వైరల్‌‌‌‌ అవుతున్నాయి.