విజయ్‌‌ హజారే టోర్నీకి హైదరాబాద్‌‌ జట్టు ఎంపిక

విజయ్‌‌ హజారే టోర్నీకి హైదరాబాద్‌‌ జట్టు ఎంపిక

హైదరాబాద్‌‌, వెలుగు :  బీసీసీఐ విజయ్‌‌ హజారే వన్డే టోర్నమెంట్‌‌లో పాల్గొనే  హైదరాబాద్‌‌ క్రికెట్‌‌ టీమ్‌‌ను హెచ్‌‌సీఏ శుక్రవారం ప్రకటించింది. తన్మయ్‌‌ అగర్వాల్‌‌ కెప్టెన్సీలో మొత్తం 20 మందితో జట్టును ఎంపిక చేసింది. యంగ్‌‌ బ్యాటర్‌‌ తిలక్‌‌ వర్మకు వైస్‌‌ కెప్టెన్సీ అప్పగించింది. ఢిల్లీ వేదికగా ఈనెల 12 నుంచి జరిగే ఈ టోర్నీలో తొలి మూడు మ్యాచ్‌‌ల్లో ఈ జట్టు పాల్గొంటుందని హెచ్‌‌సీఏ తెలిపింది. ఈ టోర్నీలో గ్రూప్‌‌–ఎలో బరిలో నిలిచిన హైదరాబాద్‌‌ తొలి మ్యాచ్‌‌ల్లో  హిమాచల్‌‌ ప్రదేశ్‌‌, త్రిపుర, సౌరాష్ట్రతో  పోటీ పడుతుంది.

హైదరాబాద్‌‌ జట్టు :  తన్మయ్ అగర్వాల్ (కెప్టెన్), ఠాకూర్ తిలక్ వర్మ (వైస్‌‌ -కెప్టెన్), ఎం. అభిరత్ రెడ్డి, రోహిత్ రాయుడు,  బుద్ధి రాహుల్,  టి. రవితేజ, మీర్ జావీద్ అలీ,  తనయ్ త్యాగరాజన్, రక్షణ్‌‌ రెడ్డి,  మిఖిల్ జైస్వాల్, రిషిత్ రెడ్డి, అలంక్రిత్ అగర్వాల్,  భగత్ వర్మ,   అనికేత్ రెడ్డి, ధీరజ్ గౌడ్ (కీపర్‌‌), సంకేత్, భవేష్ సేథ్ (కీపర్‌‌), విక్రమ్, సమిత్ రెడ్డి, సంతోష్ గౌడ్.