- హెచ్‌సీఏ సెక్రటరీ జీవన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: రాబోయే హోమ్ సీజన్‌లో టీమిండియా ఆడబోయే రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లను హైదరాబాద్‌కు కేటాయించడం పట్ల హెచ్‌సీఏ సెక్రటరీ మన్నే జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. రాబోయే ఐపీఎల్‌తో పాటు అక్టోబర్ 14న వెస్టిండీస్‌తో టీ20, జనవరి 6న జింబాబ్వేతో వన్డే మ్యాచ్‌ను ఉప్పల్ స్టేడియంలో విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేస్తామన్నారు.
స్టేడియంలో సౌకర్యాలను ఇంకా మెరుగు పరిచి భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్‌లు నగరంలో జరిగేలా తమ కార్యవర్గం పని చేస్తుందని జీవన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘హైదరాబాద్‌కు బీసీసీఐ రెండు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు కేటాయించడం శుభసూచకం. రాబోయే రోజుల్లో మరిన్ని మ్యాచ్‌లను ఉప్పల్‌కు తీసుకురావడానికి కృషి చేస్తాం. హెచ్‌సీఏ ప్రతిష్టను మరింతగా పెంచుతాం’ అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.
