కార్డు లేకుండానే మనీ విత్‌డ్రా!

V6 Velugu Posted on Aug 01, 2021

హైదరాబాద్‌‌, వెలుగు: మనీ విత్‌‌డ్రా చేయాలనుకుంటున్నారా? డెబిట్‌‌ కార్డును మర్చిపోయారా? హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ కొత్త ఫీచర్‌‌‌‌తో కార్డు లేకుండానే డబ్బులను విత్‌‌డ్రా చేసుకోవచ్చు. అన్ని హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ ఏటీఎంలలో  కార్డ్‌‌లెస్‌‌ విత్‌‌డ్రాలను చేసుకునే ఫెసిలిటీని హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ తీసుకొచ్చింది. అంతేకాకుండా ఈ కొత్త ఫీచర్‌‌‌‌తో కేవలం మొబైల్ నెంబర్‌‌‌‌తోనే   మనీని ట్రాన్స్‌‌ఫర్ చేయొచ్చు. నెట్‌‌బ్యాంకింగ్‌‌ ద్వారా బెనిఫిషరీ అకౌంట్లను ఈజీగా యాడ్‌‌ లేదా డిలీట్ చేసుకోవచ్చు. 

కొత్త ఫీచర్‌‌‌‌ను ఇలా యాక్టివేట్‌‌ చేయొచ్చు..

1) ఫస్ట్ టైమ్ ఈ ఫీచర్‌‌‌‌ను వాడే కస్టమర్లు, బెనిఫిషరీని నెట్‌‌బ్యాంకింగ్ ద్వారా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.
2) నెట్‌‌ బ్యాంకింగ్‌‌కి లాగిన్ అయ్యి ఫండ్ ట్రాన్స్‌‌ఫర్‌‌‌‌  ట్యాబ్‌‌లో కార్డ్‌‌లెస్‌‌ క్యాస్ విత్‌‌డ్రాయల్ ఆప్షన్‌‌ను క్లిక్ చేయాలి. డెబిట్ అకౌంట్‌‌ను సెలెక్ట్ చేయాలి. ఎవరికి డబ్బులు పంపాలనుకుంటున్నారో వారి డిటైల్స్‌‌ను చెక్ చేసుకోవాలి. అమౌంట్‌‌ను ఎంటర్ చేసి కంటిన్యూపై క్లిక్ చేయాలి. మొబైల్‌‌ నెంబర్‌‌‌‌ను ఎంటర్ చేసిన ఓటీపీతో ట్రాన్సాక్షన్‌‌ను వ్యాలిడేట్‌‌ చేయాల్సి ఉంటుంది. బెనిఫిసరీకి ఓటీపీ, 9 అంకెల ఆర్డర్‌‌‌‌ ఐడీ, అమౌంట్ డిటైల్స్‌‌తో కూడిన విత్‌‌డ్రా రిక్వెస్ట్ వస్తుంది.
3) హెచ్‌‌డీఎఫ్‌‌సీ బ్యాంక్ ఏటీఎం దగ్గరకు వెళ్లి స్క్రీన్‌‌పై కనిపించే లిస్టులో కార్డ్‌‌లెస్‌‌ క్యాష్‌‌ ట్యాబ్‌‌ను క్లిక్ చేయాలి. కస్టమర్‌‌‌‌కు ఓటీపీ, బెనిఫిసరీ మొబైల్‌‌ నెంబర్‌‌‌‌, 9 అంకెల ఆర్డర్ ఐడీ, ట్రాన్సాక్షన్‌‌ అమౌంట్‌‌ డిటైల్స్‌‌ను ఇస్తే క్యాష్‌‌ విత్‌డ్రా చేసుకోవచ్చు.
4)  రోజుకి కనీసం రూ. 100 నుంచి రూ. 10 వేల వరకు విత్‌‌డ్రా చేసుకోవచ్చు. 

Tagged HDFC Bank, cardless cash withdrawal

Latest Videos

Subscribe Now

More News