
న్యూఢిల్లీ: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ గ్రాస్ అడ్వాన్స్‌లు (ఇచ్చిన అప్పులు) ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.27.69 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది జూన్ క్వార్టర్‌తో సెప్టెంబర్ క్వార్టర్‌లో 4.4శాతం పెరిగాయి.
కిందటేడాది సెప్టెంబర్ 30 నాటికి ఉన్న అడ్వాన్స్‌లతో పోలిస్తే 9.9శాతం వృద్ధి నమోదైంది. డిపాజిట్లు రూ.27.1 లక్షల కోట్లకు చేరాయి. ఏడాది లెక్కన 15.1శాతం గ్రోత్ నమోదైంది. బ్యాంక్ కరెంట్ అండ్ సేవింగ్స్ అకౌంట్ ( కాసా) డిపాజిట్లు రూ.8.77 లక్షల కోట్లకు చేరగా, అసెట్ అండర్ మేనేజ్‌మెంట్ (ఏయూఎం) రూ.27.94 లక్షల కోట్లను టచ్ చేసింది.
మరోవైపు కోటక్ మహీంద్రా బ్యాంక్ ఈ ఏడాది సెప్టెంబర్ 30 నాటికి రూ.4.62 లక్షల కోట్ల నెట్ అడ్వాన్సులతో 15.8శాతం వార్షిక వృద్ధిని నమోదు చేసింది. క్వార్టర్లీ పరంగా ఇది 4శాతం గ్రోత్‌కు సమానం. బ్యాంక్ మొత్తం డిపాజిట్లు రూ.5.28 లక్షల కోట్లకు చేరాయి.