కరోనా ప్రాంతాల్లో HDFC మొబైల్ ఏటీఎంలు

కరోనా ప్రాంతాల్లో HDFC  మొబైల్ ఏటీఎంలు

కరోనా ఆంక్షలున్న ప్రాంతాల్లో ప్రజలు డబ్బుల కోసం ఇబ్బంది పడకుండా కీలక నిర్ణయం తీసుకుంది ప్రముఖ దిగ్గజ బ్యాంక్ HDFC. దేశంలో కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాప్తిస్తుండడంతో..దేశంలో మళ్లీ లాక్ డౌన్ విధించనున్నట్లుగా గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.  ఈ క్రమంలోనే తమ కస్టమర్లకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకూడదని.. HDFC బ్యాంక్ మొబైల్ ATMలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. దేశంలోని 19 నగరాల్లో ఈ మొబైల్‌ ఏటీఎంలను బ్యాంక్‌ ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌, విజయవాడ, ముంబై, చెన్నై ఢిల్లీతో పాటు పలు నగరాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ఇవాళ్టి(శనివారం-24) నుంచి ATMలను ఏర్పాటు చేసినట్లు సంస్థ స్పష్టం చేసింది.స్థానిక సంస్థలతో చర్చించి మొబైల్ ఏటీఎంలు ఏ ఏ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచాలో నిర్ణయం తీసుకోనుంది.