డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ

 డిపాజిట్ వడ్డీ రేట్లు తగ్గించిన హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ

న్యూఢిల్లీ: ఆర్​బీఐ ఇటీవల రెపో రేటును తగ్గించడంతో హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్,  ఐసీఐసీఐ బ్యాంక్ తమ రిటైల్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి. ఐసీఐసీఐ బ్యాంక్ ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్ల (ఎఫ్​డీ)పై వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ఈ సవరించిన రేట్లు ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 

రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై, సాధారణ పౌరులకు 3శాతం నుంచి 6.6శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.5శాతం నుంచి 7.10శాతం వరకు వడ్డీ ఇస్తారు. హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్ కూడా తమ ఫిక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్ డిపాజిట్లు, సేవింగ్స్ ఖాతాలపై వడ్డీ రేట్లను తగ్గించింది. కొత్త రేట్లు ఈ నెల పదో తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. 

రూ. 3 కోట్ల లోపు డిపాజిట్లపై, సాధారణ పౌరులకు 2.75శాతం నుంచి 6.60శాతం వరకు, సీనియర్ సిటిజన్లకు 3.25శాతం నుంచి 7.10శాతం వరకు వడ్డీ చెల్లిస్తారు. సేవింగ్స్ ఖాతాలపై, బ్యాలెన్స్ మొత్తంతో సంబంధం లేకుండా, అన్ని ఖాతాలకు 2.75శాతం వడ్డీ ఇస్తారు.  ఇది వరకు 3.25శాతం వడ్డీ లభించేది.