రూ.300 లోషన్ ఆర్డర్ చేస్తే.. రూ.19 వేల హెడ్​ఫోన్స్ వచ్చాయి

రూ.300 లోషన్ ఆర్డర్ చేస్తే.. రూ.19 వేల హెడ్​ఫోన్స్ వచ్చాయి

ముంబై: ఆన్ లైన్​లో ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి పంపుతుంటారు. వేలకు వేలు డబ్బులు పే చేశాక ఒక్కోసారి నకిలీ ఐటెమ్స్ డెలివరీ అవుతుంటాయి. ఐ ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు, రాళ్లు వచ్చిన వార్తలు కూడా విన్నాం. తాజాగా ఒకతనికి మాత్రం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి రావడమే మస్తు కలిసొచ్చింది.

మహారాష్ట్రలోని పుణెకు చెందిన గౌతమ్ రేజ్ అనే వ్యక్తి ఆన్ లైన్ షాపింగ్ అమెజాన్ లో స్కిన్ లోషన్ ఆర్డర్ చేస్తే .. 19 వేలు విలువ చేసే హెడ్ ఫోన్స్ వచ్చాయి. ఇంకేముంది షాక్ తినడంతో పాటు ఎగిరి గంతేసినంత పనిచేశాడు. కానీ, మనకెందుకులే అనుకుని కస్టమర్ కేర్ కు కాల్ చేసి రిటర్న్ తీసుకోవాలని, తాను ఆర్డర్ చేసిన వస్తువిస్తే చాలని చెప్పాడు. దీంతో అది నాన్ రిటర్నెబుల్ ఐటమ్ కావడంతో రిటర్న్ తీసుకోవడం కుదరదని సమాధానం చెప్పడమే కాకుండా.. ఆర్డర్ చేసిన స్కిన్ లోషన్ ఇవ్వలేకపోయామని సారీ చెప్తూ దాని డబ్బులు రూ.300 కూడా తిరిగి ఇచ్చేశారు కంపెనీవాళ్లు.

ఇంకేముంది.. ఇ ముచ్చట హ్యాపీగా ట్విట్టర్ లో షేర్ చేశాడు. ‘‘300 రూపాయల లోషన్ ఆర్డర్ చేశాను. దానికి బదులు రూ.19 వేలు ఖరీదు చేసే వైర్ లెస్ హెడ్ ఫోన్స్ వచ్చాయి. దాంతో పాటు ఓ సర్ఫ్ ప్యాకెట్ కూడా వచ్చింది. కస్టమర్ కేర్​కు కాల్ చేస్తే వాటిని నన్నే ఉంచుకోమన్నారు”అని గౌతమ్ ట్వీట్ చేశాడు.