లవ్ చేయట్లేదని స్క్రూ డ్రైవర్ తో 18 పోట్లు పొడిచాడు.. ఇంతకు మించిన క్రూరత్వం ఎక్కడా ఉండదేమో..!

లవ్ చేయట్లేదని స్క్రూ డ్రైవర్ తో 18 పోట్లు పొడిచాడు.. ఇంతకు మించిన క్రూరత్వం ఎక్కడా ఉండదేమో..!

మనుషుల్లో మృగాళ్లు ఉంటారని విన్నాం కానీ.. మృగాలను మించిన క్రూర జంతువు మనిషేనని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తే అర్థమవుతుంది. ఒక అమ్మాయిపై ఇష్టం పెంచుకుని లవ్ చేయమంటే కచ్చితంగా చేయాలా..? యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది ఆమె నిర్ణయం. కానీ నాకు దక్కనిది ఇంకొరికి దక్కటానికి వీళ్లేదు అన్నట్లుగా.. అత్యంత క్రూరంగా స్క్రూ డ్రైవర్ తో పొడిచి చంపాడు ఓ దుర్మార్గుడు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. 

వివరాల్లోకి వెళ్తే.. యూపీ మొరాదాబాద్ కొత్వాలి మైనతార్ గ్రామంలో లవ్ చేయట్లేదని సైరా అనే మహిళను హత్య చేశాడు రఫి అనే రాక్షసుడు. ఆదివారం (జూన్ 2) జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పశువుల మేతకు వెళ్లిన సైరా.. సాయంత్రం అయినా రాకపోవడంతో ఊరు, పొలాలు మొత్తం వెతికారు తల్లిదండ్రులు. ఆ తర్వాతి రోజు అంటే సోమవారం పూర్తిగా పొడిచిన గాయాలతో రక్తపు మడుగులో పడి ఉన్న కూతుర్ని చూసి తల్లడిల్లిపోయారు.

పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటనా స్థలానికి చేరుకుని బాడీని పోస్ట్ మార్టంకు పంపించారు. అయితే ఆమె గాయలను చూసి అత్యాచారానికి గురైందని మొదట పోలీసులు భావించారు. కానీ పోస్ట్ మార్టం రిపోర్టులో అత్యాచారం జరగలేదని.. స్క్రూ డ్రైవర్ తో ప్రైవేట్ పార్ట్స్ పైన పొడిచినట్లు.. అదే విధంగా బాడీ మొత్తం కలిపి 18 పోట్లు పొడిచినట్లు తేలింది. 

అయితే దర్యాప్తులో ఆమె ఫోన్ కు 5 మిస్స్ డ్ కాల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ట్రేస్ చేసి చూస్తే అదే గ్రామానికి చెందిన అది రఫి అనే వ్యక్తిదని పోలీసులు తేల్చారు. తమ కూతురు సైరాను గత కొంత కాలంగా లవ్ చేయాల్సిందిగా వేధిస్తున్నాడని ఆమె తల్లి సఫీనా పోలీసులకు చెప్పింది. దీంతో రఫిని కస్టడీలోకి తీసుకుని విచారించగా చంపింది తానేనని ఒప్పుకున్నాడు. 

చంపేసి.. స్నానం చేసి ప్రశాంతకంగా పడుకున్నా: హంతకుడు

‘‘గత కొంత కాలంగా సైరాను లవ్ చేస్తున్నాను.. కానీ ఆమె నా ప్రేమను యాక్సెప్ట్ చేయలేదు. నా బాధను అర్థం చేసుకోవడం లేదు. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి నన్ను కొట్టాడు. సైరానే కొట్టించిందని నాకు అర్థమైంది. వాళ్లిద్దరి మధ్య లవ్ ఉందని నాకు కన్ఫామ అయ్యింది. అంది నేతు తట్టుకోలేక పోయా. అందుకే చంపేసి.. స్నానం చేసి డ్రెస్ మార్చుకుని ప్రశాంతంగా పడుకున్నా..’’ అని పోలీసులకు చెప్పాడు హంతకుడు రఫి. 

సైరాను అంతం చేసేందుకు రెండు రోజులుగా ఫాలో అవుతూ.. అదును చూసి కిరాతకంగా చంపేశాడు దుర్మార్గుడు. స్క్రూ డ్రైవర్ తో 18 సార్లు పొడిచినట్లు పోలీసులకు చెప్పాడు.

స్క్రూ డ్రైవర్ పోట్లతో కొట్టుమిట్టాడుతున్న సైరా.. బతికించమని వేడుకున్నప్పుడు ఈ రాక్షసుడు చేసిన పనికి వీడికేం శిక్ష వేసినా తక్కువే అనిపించేలా కోపం రాక తప్పదు అని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. ఎందుకంటే.. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న సైరా.. బతికించని వేడుకుంటుంటే.. నీకు జీవితం లేదు అంటూ ఆమె ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా పొడిచాడంట. ఎంత నరకం.. ఎంత వేదన భరించి ఉంటుందో ఆ టైమ్ లో ఆ బాధితురాలు. 

ప్రేమ ఎంత పవిత్రమైందో.. దానికి అర్హత లేని రఫి లాంటి వాళ్లు ప్రేమిస్తే అంత కిరాతకమైన ఫలితాలు వస్తాయి కావచ్చు. ఎందుకంటే ప్రేమించడం.. ప్రేమించమని అడగటం వరకు ఓకే. అయితే లవ్ ప్రపోజ్ చేస్తే అందుకు ఒప్పుకోవాలా వద్దా.. ప్రేమించాలా లేదా అనేది అవతలి వాళ్ల  డెసిషన్. అదే సమయంలో వాళ్లు మరొకర్ని ప్రేమిస్తుంటే.. మరొకరు ప్రపోజ్ చేస్తే.. బెదిరిస్తే యాక్సెప్ట్ చేస్తారా..? ఆమె మరొకరితో లవ్ లో ఉందని తెలిసి కూడా తనను ప్రేమించాలనుకుంటే అంతకు మించిన మూర్ఖత్వం ఎక్కడైనా ఉంటుందా. ఆ మూర్ఖత్వం.. నుంచి ఈ అరాచకత్వం పుట్టుకొచ్చింది కాబోలు. ఈ దుర్మార్డుడి చేతిలో బలైపోయింది ఆ అమాయకురాలు.