పేరెంట్స్ స్వస్థలం సహా.. 21 ప్రశ్నలతో NPR

పేరెంట్స్ స్వస్థలం సహా.. 21 ప్రశ్నలతో NPR

న్యూఢిల్లీ: నేషనల్​ పాపులేషన్​ రిజిస్టర్(ఎన్​పీఆర్) అప్​డేషన్​ కోసం ప్రశ్నాపత్రం సిద్ధమైంది. గతేడాది సెప్టెంబర్​లో నిర్వహించిన ట్రయల్​లో అధికారులు ఉపయోగించిన మోడల్​ పేపర్​నే ఫైనల్​ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పైలట్​ ప్రాజెక్టులో మొత్తం 74 జిల్లాల్లోని 30 లక్షల మంది వివరాలు సేకరించారు. దీనికి ప్రజల స్పందన బాగుందని, పెద్దగా అభ్యంతరాలు వ్యక్తంకాలేదని సమాచారం. దీంతో ఏప్రిల్​లో సెన్సస్ తో పాటే చేపట్టనున్న ఎన్​పీఆర్​లో ఇదే పేపర్​ను వాడాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ పేపర్​లో.. తల్లిదండ్రుల పుట్టిన ప్రదేశం సహా మొత్తం 21 ప్రశ్నలు పొందుపరిచారు. ఆధార్​ కార్డు(ఆప్షనల్), ఓటర్​ ఐడీ, మొబైల్​ నంబర్, డ్రైవింగ్​ లైసెన్స్​ నంబర్​తదితర వివరాలను కూడా సేకరిస్తారు.

పదేళ్ల క్రితం సేకరణ

పాపులేషన్​ రిజిస్టర్ కోసం 2010లో వివరాలు సేకరించినట్లు అధికారులు చెప్పారు. అప్పట్లో కేవలం 15 అంశాలకు సంబంధించిన వివరాలనే సేకరించినట్లు తెలిపారు. తర్వాత ఆ రిజిస్టర్​ను 2015లో అప్​డేట్​ చేశామన్నారు. ఈసారి 21 అంశాలపై వివరాలు సేకరించనున్నట్లు వివరించారు.

ఏమేం ప్రశ్నలు ఉంటయ్

పేరు, కుటుంబ యజమానితో బంధుత్వం, తల్లిదండ్రుల పేర్లు, భార్య/భర్త  పేరు, జెండర్, పుట్టిన రోజు, ప్రదేశం, వైవాహిక స్థితి, జాతీయత, చిరునామా, ఎప్పట్నుంచి ఉంటున్నారు.. శాశ్వత చిరునామా, ఆక్యుపేషన్, విద్యార్హతలకు సంబంధించి మొత్తం 21 ప్రశ్నలు

ముందే చెప్పి వెళతాం

ఎన్​పీఆర్​లో భాగంగా సమాచార సేకరణకు వెళ్లే ముందే ఇన్ఫర్మేషన్​ ఇస్తామని అధికారులు చెప్పారు. ఒక కుటుంబంలో 15 మంది, అంతకు మించి సభ్యులు ఉంటే ముందు నోటీసు ఇచ్చి ఆ తర్వాతే వెళతామన్నారు. దీనివల్ల అవసరమైన డాక్యుమెంట్లను వారు సిద్ధం చేసుకునేందుకు వీలుంటుందని వివరించారు. ఆ డాక్యుమెంట్లను ఎన్యుమరేటర్​ పరిశీలిస్తారని చెప్పారు.