
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న ఆరోగ్య ద్రవ్యోల్బణం ప్రజలను ఇన్సూరెన్స్ పాలసీలు కొనుక్కోవాల్సిన దిశగా నడిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబంలో ఒక్కరికి అనారోగ్యం ఏర్పడినా చికిత్సల ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ప్రజలు ముందుగానే కళ్లు తెరచి ఆరోగ్య బీమా పాలసీలను కొనుక్కుంటున్నారు. దీనికి తోడు ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని ఇన్సూరెన్స్ ఉత్పత్తులపై సున్నాకు తగ్గించటం ప్రయోజనకరంగా కూడా మారింది ప్రజలకు.
ఈ క్రమంలో ఎస్‌బీఐ జనరల్ ఇన్షూరెన్స్ కొత్తగా ‘హెల్త్ ఆల్ఫా’ పేరుతో ఇన్సూరెన్స్ ఉత్పత్తిని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని కింద 50కి పైగా కవరేజ్ ఆప్షన్లు రిటైల్ హెల్త్ ఇన్షూరెన్స్ కలిగి ఉంటాయి. వినియోగదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఎంపికలు చేసుకునేందుకు కంపెనీ ఇందులో వెసులుబాట్లు కల్పించింది. కనీసం రూ.5 లక్షల నుంచి అపరిమిత సమ్ ఇన్సూరెన్స్ ఫెసిలిటీ ఇందులో ఉంది. గరిష్టంగా 5ఏళ్లకు పాలసీ కొనసాగించుకునే వారికి వైద్య ద్రవ్యోల్బణం నుండి రక్షణకై టెన్యూర్ ఆధారిత డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. 91 రోజుల వయస్సు ఉన్న పిల్లల నుంచి ఎవ్వరైనా పాలసీని కొనుగోలు చేయవచ్చు.
పాలసీ కింద అందే ప్రయోజనాలు..
1. క్లెయిమ్ చేయని సంవత్సరాలకు గరిష్టంగా 10 రెట్లు బోనస్.
2. పాలసీ ప్రాథమిక కవరేజ్‌కు పరిమితి లేకుండా, నిబంధనల ప్రకారం ఏదైనా క్లెయిమ్ మొత్తాన్ని ఆమోదించే అవకాశం.
3. జీవితంలో ఒక్కసారి, ప్రాథమిక సమ్ ఇన్షూరెన్స్‌ను మించిపోయే ఒక క్లెయిమ్‌కు అదనపు ఆసుపత్రి ఖర్చుల కవరేజ్ చేసే ఫెసిలిటీ.
4. వ్యాయామం లేదా హాబీ స్పోర్ట్స్‌లో గాయాలపై OPD ప్రయోజనాలతో పాటు, స్పెషలిస్టు కన్సల్టేషన్లు, డయాగ్నస్టిక్ టెస్టులు, మందులు, ఫిజికల్ థెరపీ సౌకర్యం.
5. పెళ్లి తరువాత భార్య (35 ఏళ్లు లోపు) లేదా నూతన శిశువులు (ఇద్దరు పిల్లలకు ).. పెళ్లి లేదా పిల్లలు పుట్టిన తరువాత 120 రోజుల్లో చేరితే వెయిటింగ్ పీరియడ్ కొనసాగింపు.
6. కోట్ జెనరేషన్ తరువాత 5 రోజుల్లో పాలసీ తీసుకుంటే 5% డిస్కౌంట్.
ఇక ఇతర పాలసీ సౌకర్యాల విషయానికి వస్తే.. హాస్పిటలైజేషన్‌తో పాటు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ కవర్, డే కేర్ ట్రీట్‌మెంట్‌లు, అయుష్ ట్రీట్‌మెంట్, క్రిటికల్ ఇల్నెస్, హాస్పిటల్ డైలీ క్యాష్, గ్లోబల్ కవర్, పర్సనల్ యాక్సిడెంట్ కవర్, కొత్త కవరేజ్‌లు అయిన జిమ్ & స్పోర్ట్స్ ఇంజురీ, ఎండ్లెస్ సమ్ ఇన్షూరెన్స్, మోడిఫైయర్లు మరెన్నో ప్రయోజనాలను అందిస్తోంది. అలాగే పాలసీదారులు తమ అవసరాలకు అనుగుణంగా కవరేజ్ పరిమితులను మార్చుకోవడం, సబ్-లిమిట్లు ఎంచుకోవడం, వెయిటింగ్ పీరియడ్‌లను సవరించుకునే పూర్తి స్వేచ్ఛని ఈ పాలసీ అందిస్తోంది.