
‘అరెరే అంత ఆత్రం ఏంటి రా? మెల్లగా నమిలి తిను’ అని చిన్నప్పటి నుంచి మనకు చెప్తూనే ఉంటారు. మంచిగ నమిలి తింటే చాలా లాభాలు ఉన్నాయి. అదే విషయం ఇప్పటికే చాలా సర్వేల్లో తేలింది కూడా. స్లోగా తినడం వల్ల బరువు కూడా తగ్గుతామట! స్లోగా తినేవాళ్లకంటే ఫాస్ట్‌గా తినేవాళ్లు 115 శాతం లావు అవుతారని సర్వేలు చెప్తున్నాయి. దాదాపు 4,000 మంది మీద ఒక సర్వే చేసి ఈ విషయాన్ని చెప్పారు ఫిట్‌నెస్ ఎక్స్‌పర్ట్స్. ఫాస్ట్‌గా తినేటప్పుడు పొట్టకు.. బ్రెయిన్‌కు సిగ్నల్ ఇచ్చే టైం ఉండదట అందుకే ఎక్కువగా తినేస్తారు. ఫుడ్ బాగా నమలడం వల్ల కేలరీలు తక్కువగా వెళ్లి బరువు తగ్గుతారని చెబుతున్నారు ఎక్స్‌పర్ట్స్. అందుకే, ఒక్కో ముద్దను దాదాపు 30 సెకన్లు నమలాలంటున్నారు.
- ఎక్కువసేపు ఆకలితో ఉండొద్దు. బాగా ఆకలిగా ఉన్నప్పుడు ఫాస్ట్‌గా తినేస్తాం. అందుకే, టైంకు ఫుడ్ తీసుకుంటే మంచిది.
- మనం జనరల్‌గా ఎన్నిసార్లు, ఎంతసేపు నములుతున్నామో చూసుకుని, దాన్ని బట్టి టైం పెంచుకుంటే మంచిది.
- ఫైబర్ ఫుడ్‌ను ఎక్కువగా తినాలి. ఫైబర్ కంటెంట్ ఫుడ్ అయితే ఎక్కువసేపు నమిలి తినొచ్చు కూడా.
- తినేముందు కచ్చితంగా ఒక గ్లాసు నీళ్లు తాగితే క్యాలరీ ఇన్‌టేక్ తగ్గుతుంది.
- తినేటప్పుడు ప్రశాంతంగా ఉండాలి. గాడ్జెట్స్ వాడుతూ, టీవీ చూస్తూ తినకూడదు.