హెల్త్ క్యాంప్ నిర్వహించిన బృహస్పతి టెక్నాలజీస్

హెల్త్ క్యాంప్ నిర్వహించిన బృహస్పతి టెక్నాలజీస్

హైదరాబాద్, వెలుగు: ఏఐ సర్వెయిలెన్స్, ఐటీ సొల్యూషన్స్ అందించే హైదరాబాద్​సంస్థ బృహస్పతి టెక్నాలజీస్ లిమిటెడ్ ఇంటర్నేషనల్ సెల్ఫ్‌‌‌‌కేర్ డేను పురస్కరించుకుని, సంస్థ హెడ్​ ఆఫీసులో ఉద్యోగుల కోసం ప్రత్యేక హెల్త్ క్యాంప్‌‌‌‌ను నిర్వహించింది. ఆఫీస్ సమయాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల నుంచి సుమారు 100 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. వీరికి పలు రకాల టెస్టులు చేశారు.  కలర్ బ్లైండ్‌‌‌‌నెస్ స్క్రీనింగ్, రిఫ్రాక్షన్, ఈసీజీ, బీపీ,  బ్లడ్ షుగర్ లెవల్స్, బాడీ మాస్ ఇండెక్స్,  డెంటల్ చెకప్‌‌‌‌లు నిర్వహించారు.