Good Health: బరువు పెరగొద్దంటే.. రోజూ పొద్దున్నే ఇవి తినాలి..

Good Health:  బరువు పెరగొద్దంటే.. రోజూ పొద్దున్నే ఇవి తినాలి..

బరువు పెరగడం, నిద్రలేమి, షుగర్, బీపీ... ఇవన్నీ కూడా చాలా వరకు సరైన సమయానికి తినక పోవడం వల్లే వస్తాయంటారు ఆరోగ్య నిపుణులు. అసలు పొద్దున ఏమి తినాలి, రాత్రిళ్లు ఏమి తినాలో తెలియకపోవడం కూడా ఒక కారణం. రాత్రి పూట ఏది పడితే అది తినడం వల్ల బరువు పెరిగిపోతున్నారు. దీర్ఘకాల వ్యాధుల బారిన పడుతున్నారని అంటున్నారు వైద్య నిపుణులు. అయితే కొన్నిటిని పొద్దున్న మాత్రమే తినాలి. రాత్రి పూట తినకూడదు. అవేంటో తెలుసుకుంటే వాటిని పాటించొచ్చు.

•ఉదయం పూట ఆలుతో చేసిన వంటలు తినడం వల్ల వెంటనే ఎనర్జీ వస్తుంది. రోజువారీ చేసే పనులు చురుకుగా చేసేందుకు అది ఇంధనంలా పనిచేస్తుంది. వీటిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి. అందువల్ల రాత్రి సమయంలో అసలు తినకూడదు.
• చీజ్ ఉదయం పూట తింటే బరువు పెరగడాన్ని నియంత్రిస్తుంది. అదే రాత్రైతే జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. సులువుగా బరువు కూడా పెరుగుతారు. 
• క్యాలరీస్ కరిగించడానికి చక్కెర ఉత్పత్తులు ఉపయోగపడతాయి. అందుకే వీటిని ఉదయం తినాలి. నిద్రపోయే సమయంలో తినకూడదు. అన్నాన్ని రాత్రుళ్లు తినడం కంటే లంచ్ టైమ్ లో తింటే మంచిది.
 • చికెన్, మటన్ అరగాలంటే ఎక్కువ సమయం పడుతుంది. అందుకే వీటిని డిన్నర్ లో కంటే లంచ్ లోనే తినడం ఉత్తమం.
పొద్దున పూట ఆపిల్స్ తినడం ఎంతో మంచిది. వీటిని మధుమేహం ఉన్నవాళ్లు అన్నం తిన్న రెండు గంటల తర్వాత లేదా అన్నం తినడానికి గంట ముందు తినాలి. 
• నట్స్ కూడా లంచ్ సమయంలోనే తింటే మంచిది. డిన్నర్ వేళలో నట్స్ తినడం మంచిది కాదు.
• భోజనానికి పదిహేను నిమిషాల ముందు తక్కువ క్యాలరీస్ కలిగిన సలాడ్ని తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
 • ఉత్త పెరుగుని ఎప్పుడూ నేరుగా తినకూడదు. చక్కెరతో కలిపి తింటే మంచిది. రాత్రి పూట పెరుగు తినడం అసలు మంచిది కాదు. మజ్జిగ మాత్రం వేసవిలోనే కాదు మిగతా కాలాల్లో కూడా తాగొచ్చు.
• బ్రేక్ ఫాస్ట్, లంచ్ సమయాల్లో పాస్తా తినొచ్చు. బీపీని తగ్గిస్తుంది. గుండె సమస్యలు దరి చేరవు. రాత్రి పూట పాస్తా, తినకూడదు.
• డార్క్ చాక్లెట్లు ఉదయం తింటే మంచిది. ఒత్తిడి తగ్గించి శక్తినిస్తాయి. అరటిపండు తిన్న వెంటనే శక్తినిస్తుంది. దీన్ని ఉదయం పూట తింటే ఎంత మంచిదో రాత్రి పూట తిన్నా అంతే మంచిది. ఆరెంజ్ జ్యూస్ ఎప్పుడైనా తాగొచ్చు. అయితే ఖాళీ కడుపుతో మాత్రం తాగకూడదు. ఎసిడిటీ వస్తుంది.
•బరువు పెరగకుండా ఉండాలి అనుకునేవాళ్లు ఉదయాన్నే కడుపునిండా ఓట్స్ తింటే మధ్యాహ్నం వరకూ ఆకలి వేయకుండా ఉంటుంది. నూనె ఉండదు కాబట్టి బరువు సులువుగా తగ్గుతారు.