V6 News

కాల భైరవ స్వామికి మంత్రి దామోదర పూజలు

కాల భైరవ స్వామికి మంత్రి దామోదర పూజలు

సదాశివనగర్, వెలుగు :  రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోని కాల భైరవ స్వామికి శుక్రవారం కుటుంబీకులతో కలిసి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నర్సింహ ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. ఆలయ సిబ్బంది మంత్రికి ఘన స్వాగతం పలికారు.  ఆలయ కమిటీ ఈవో ప్రభు ఆధ్వర్యంలో మంత్రి, కుటుంబీకులను శాలువాల సత్కరించి స్వామివారి ఫొటోలను అందజేశారు. మంత్రికి ఆలయ చరిత్రను వివరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఆలయాలను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరాయన్నారు. 

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయాల పునరుద్ధరణ, పునర్నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక నిధులు మంజూరు చేసిందన్నారు. కోరిన కోరికలు తీర్చే కాలభైరవ స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఆలయ పరిసరాలను మంత్రి పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.