
కామారెడ్డి జిల్లాలో పర్యటించారు మంత్రి హరీశ్ రావు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన సందర్శించారు. ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే శ్రీ గంప గోవర్ధన్, వైద్యారోగ్యశాఖ కమిషనర్ శ్రీమతి వాకాటి కరుణ, జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్, జిల్లా ఆసుపత్రి పర్యవేక్షకులు డా. అజయ్ కుమార్ కూడా మంత్రి వెంట ఉన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల మాత శిశురక్షా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. జిల్లా కేంద్రంలోని అంజల్ రెడ్డి మెమోరియల్ ఆస్పత్రి ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొననున్నారు. నూతనంగా నిర్మిస్తున్న మాతాశిశు ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలించారు. అనంతరం జిల్లా ఆస్పత్రిని మంత్రి తనిఖీ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆశా వర్కర్లకు మొబైల్ ఫోన్స్ పంపిణీ అనంతరం వైద్యాధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి హరీష్ రావు.
ఇవి కూడా చదవండి: