
- మేడారం అంతటా సీసీ కెమెరాల నిఘా
- కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షణ
- సమగ్ర సమాచారంతో మొబైల్ యాప్
- అన్ని శాఖలకు వాట్సప్ గ్రూపులు
ములుగు, వెలుగు: కాలంతోపాటే మేడారం జాతర మారుతోంది. భక్తుల భద్రత, వసతులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు మోడర్న్టెక్నాలజీని వాడుకుంటున్నారు. మొబైల్యాప్, సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్ రూం, వాట్సప్గ్రూపులు.. జాతరలో కీ రోల్పోషిస్తున్నాయి. జాతరలో ఏది ఎక్కడుందీ.. ఎలాంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.. తదితర సమగ్ర సమాచారంతో యాప్అందుబాటులోకి తెచ్చారు. ఇతర ప్రాంతాలనుంచి వచ్చేవారికి, కొత్తగా వచ్చేవారికి ఉపయోగపడేలా ఈ యాప్తయారు చేశారు. అమ్మవార్ల గద్దెలతోపాటు వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్, మెడికల్, ఆర్టీసీ సేవలు, ఇతర సౌకర్యాల రూట్మ్యాప్ఇందులో పొందుపర్చారు. జీపీఎస్ట్రాకింగ్తో లింక్ చేయడం వల్ల భక్తులు కావాలనుకున్న చోటికి ఈజీగా చేరుకోవచ్చు. తప్పిపోయిన వారి వివరాలను కూడా యాప్‌లో పోస్టు చేసే సౌలత్ ఉంది. జాతరలో అన్ని సర్వీస్ ప్రొవైడర్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ శాఖల వారీగా వాట్సప్గ్రూపులను క్రియేట్ చేసి సంబంధిత ఆఫీసర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. అన్ని గ్రూపులను కలెక్టర్టచ్లో ఉండే నాలుగు గ్రూపులతో లింక్చేశారు. డ్రింకింగ్ వాటర్, మరుగుదొడ్లు, పార్కింగ్ ప్లేస్‌లకు సంబంధించిన సమస్యలపై దృష్టి సారిస్తున్నారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా గ్రూపులో పోస్ట్ చేయగానే.. ఆ ఏరియాలో ఉన్న సిబ్బంది అటెండయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. గద్దెల దగ్గర పోలీసు డెన్ లో కమాండ్కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. అమ్మవార్ల గద్దెలు, చిలుకలగుట్ట, రెడ్డిగూడెం, ఆర్టీసీ, మెడికల్ క్యాంపులు, జంపన్నవాగు, నార్లాపూర్ ఏరియాల్లో 380 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నుంచి ప్రతిక్షణం పర్యవేక్షిస్తున్నారు. ఈ కంట్రోల్ రూంకు ములుగు ఏఎస్పీ సుధీర్రాంనాథ్కేకన్ఇన్చార్జీగా ఉన్నారు. జాతర ఏరియాను నాలుగు సెక్టార్లు, 8 జోన్లుగా విభజించారు. ఆయా జోన్లలో డ్యూటీ చేసే ఆఫీసర్లు వాకీటాకీలతో సిబ్బందిని గైడ్ చేస్తున్నారు.
కోఆర్డినేషన్‌తో సేవలు
మేడారం జాతరకొచ్చే వారికి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాం. అన్ని శాఖలతో కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం. కమాండ్ కంట్రోల్ రూం నుంచి వెహికల్స్రద్దీని పరిశీలిస్తూ ట్రాఫిక్ జామ్ నివారించేందుకు సూచనలు చేస్తున్నాం. ఏ ఆపద వచ్చినా జాతరలో డ్యూటీ చేస్తున్న 10,500 మంది పోలీసు ఆఫీసర్లు, సిబ్బంది వెంటనే స్పందిస్తారు.
- సుధీర్ రాంనాథ్ కేకన్, ఏఎస్పీ, ములుగు