వయసు పెరిగే కొద్దీ నచ్చిన టీ తాగేస్తున్నఇండియన్స్

వయసు పెరిగే కొద్దీ నచ్చిన టీ తాగేస్తున్నఇండియన్స్

ఏ అంశం మీద రానన్ని సర్వేలు, పరిశోధనలు‘టీ’పై వచ్చుంటాయి. రోజుకో కప్పు టీ తాగితే ముప్పేమీ లేదని, పైగా బోలెడంత ఆరోగ్యమని ఓ సర్వే చెబితే.. లేదు లేదు టీ తాగితే మీపనైపోయినట్టేనని మరికొన్ని పరిశోధనలు చెబుతుంటా యి. ‘తాగితే గ్రీన్‌‌‌‌ టీ తాగండి ..లేదంటే అసలు మొత్తానికే మానేయండి ’అంటూ మరో ఇన్వెస్టిగేషన్‌‌‌‌ తేలుస్తుంది. ఇలా‘టీ’పై అనేకనేక సూచనలొస్తున్నా వాటినేం పట్టించుకోకుండా వయసు పెరిగే కొద్ది నచ్చిన టీ తాగేస్తున్నారట ఇండియన్స్‌‌‌‌.. ఇది లేటెస్ట్‌‌‌‌ రిపోర్ట్‌‌‌‌. దీన్ని ప్రకటించింది ‘హెల్తీఫై మీ’ అనేహెల్త్‌‌‌‌యాప్‌ . ఈ రిపోర్ట్‌‌‌‌ ప్రకారం ఏడాదికి ఇండియా లో 8,37,000 టన్నుల టీ తాగేస్తున్నారట. ఏజ్‌ గ్రూపుల వారీగా 15 లక్షలమంది టీ లవర్స్‌‌‌‌ను పరిశీలించాక ‘హెల్తీఫైమీ’ వివరాలు వెల్లడించింది. 41 నుంచి 50ఏళ్లున్న వారు సాధారణం కంటే 20 శాతంఎక్కువ టీ తాగుతున్నట్టు తేలింది. 50 ఏళ్లుదాటాక టీ తాగడం 45 శాతం పెరుగుతుందని వెల్లడైంది. టీ తాగడంలో దేశంలో ఢిల్లీ ఫస్ట్‌‌‌‌, అహ్మదాబాద్‌ రెండో స్థానంలో ఉంది.సౌత్‌ కన్నా నార్త్‌‌‌‌ ఇండియన్స్‌‌‌‌ టీ తాగడంలో ముందున్నారని రిపోర్టు చెబుతోంది.