పొన్నగంటి కూరలో పోషకాలెన్నో

పొన్నగంటి కూరలో పోషకాలెన్నో

ఇప్పటి తరానికి పుంటి కూర, పాలకూర, చుక్కకూర, తోటకూర గురించి తెలిసినంతగా పొన్నగంటి కూర గురించి తెలియక పోవచ్చు. దీనిలో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో విటమిన్లు ఉన్నాయి. ఈ కూర తీసుకోవడం వల్ల ఫొలేట్, రైబో ప్లోవిన్, పోటాషియం, ఇనుము, మెగ్నీషియం లభిస్తాయి. అలాగే విటమిన్‌‌ ఎ, బి6, సి విటమిన్లు శరీరానికి అందుతాయి. పొన్నగంటి కూరలో కొలెస్ట్రా ల్‌ శాతం తక్కువ. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వాళ్లు ఈ కూర తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు అదుపులో ఉంటుంది. క్యాన్సర్‌ పై కూడా ఈ కూర పోరాడుతుంది. ఆస్తమాను నిరోధిస్తుంది. పప్పు, వేపుడు, ఇతర ఆకుకూరలతో కలిపి కూడా దీనిని తీసుకోవచ్చు. అయితే మూత్రపిండాల సమస్యలతో బాధపడే వాళ్లు దీనిని తీసుకోకపోవడమే మంచిది.