యజమాని చనిపోయాడని: ప్రపంచంలోనే ఎతైన బ్రిడ్జ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న కుక్క

యజమాని చనిపోయాడని: ప్రపంచంలోనే ఎతైన బ్రిడ్జ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న కుక్క

విశ్వాసానికి ప్రతీక కుక్క. విశ్వాసం గురించి ఎక్కడ చర్చ వచ్చినా, కుక్కకు ఉన్న విశ్వాసం లేదంటూ విమర్శించుకోవడం చూస్తూనే ఉన్నాం.

ఆ కోవకే చెందుతుంది ఈ కుక్క కూడ అది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జీ. ఓ కుక్క నాలుగు రోజుల పాటు ఆ బ్రిడ్జ్ పై అలాగే ఉంది. ఐదో రోజు ఆ బ్రిడ్జ్ నుంచి దూకి ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు పోగొట్టుకుంది.

మిర్రర్ కథనం ప్రకారం…1990 చైనాలో యిబిన్ నుంచి షాంఘై ముఖ ద్వారం వరకు 2,284కిలోమీటర్ల దూరం 75 ఫ్లైఓవర్లు, 6 టన్నెల్స్ ను కలుపుతూ యాంగ్జీ సముద్రంపై ఓ బ్రిడ్జీని నిర్మించారు. ఆ బ్రిడ్జ్ పై రాకపోకళ్లు కొనసాగుతున్నాయి.అయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ పై ఓ కుక్క నాలుగు రోజులుగా అక్కడే ఉంది. తరువాత ఆ బ్రిడ్జ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చి హృదయ విదారక ఘటనపై చైనా మీడియా సంస్థ మెట్రో పాలిస్ కథనాన్ని ప్రచురించింది.

ఓ ప్రాంతానికి చెందిన జు అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క మే 30సాయంత్రం వరకు యాంగ్జై బ్రిడ్జ్ పై ఉందని కథనంలో పేర్కొంది.  ఈ సందర్భంగా కుక్క ఆత్మహత్యపై  వుహాన్ స్మాల్ యానిమల్ ప్రొటెక్షన్ అసోసియేషన్ డైరెక్టర్ డు ఫ్యాన్ విచారణకు అధికారుల్ని ఆదేశించారు. విచారణలో కుక్క యజమానికి కొద్దిరోజుల క్రితం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడని తేలింది.

మరో అధికారి మాట్లాడుతూ బ్రిడ్జ్ పై ఏం జరిగిందో చెప్పాలని అధికారుల్ని కోరినట్లు తెలిపారు. కానీ కుక్క ఆత్మహత్య చేసుకునే సమయంలో సీసీ పుటేజ్ స్పష్టంగా లేదని, చీకటిగా ఉన్నప్పుడు బ్రిడ్జ్ పై నుంచి ఆత్మహత్య చేసుకుందని, నాలుగు రోజులుగా ఎదురు చూస్తున్న ఆ కుక్కను ఎవరైనా దత్తత తీసుకొని ఉంటే బాగుండేది. ప్రాణాల్ని కాపాడేవాళ్లమని అన్నారు. ప్రస్తుతం కుక్క ఆత్మహత్యపై యాంగ్జై ప్రాంతంలో ఉండే స్థానికులు కన్నీరు మున్నీరవుతున్నారు.