హార్ట్ టచింగ్ వీడియో..కంటతడి పెట్టిస్తుంది..వరద పాలైన ధాన్యం.. కాపాడేందుకు రైతు ప్రయత్నం

హార్ట్ టచింగ్ వీడియో..కంటతడి పెట్టిస్తుంది..వరద పాలైన ధాన్యం.. కాపాడేందుకు రైతు ప్రయత్నం

జై జవాన్.. జైకిసాన్ అనే నినాదం మనందరికి తెలుసు..బార్డర్ లో ఉండి ప్రజలను కాపాడేది జవాన్ అయితే.. దేశంలో లోపల కష్టించి పండించిన పంటతో ప్రజలకు అన్నం పెట్టి బతికించేది రైతు. అలాంటి రైతు ప్రకృతి వైపరీత్యాలు, గిట్టుబాటు ధర అందక తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రతియేటా అకాల వర్షాలకు రైతులు నష్టపోతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలు కావడంతో వారు పడుతున్న బాధ వర్ణనాతీతం. అకాల వర్షంతో మహారాష్ట్రలోని మనోరా మార్కెట్ లో ధాన్యం కొట్టుకుపోతుంటే రైతు పడుతున్న బాధ, కాపాడుకునేందుకు అతను చేసిన పోరాటం  సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతోంది..వేలాది మంది హృదయాలను కదిలించింది ఈ వీడియో.. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్లిప్ ఇప్పుడు లెక్కలేనన్ని మంది హృదయాలను తాకుతోంది.ఈ వీడియోలో ఒక రైతు తన వేరుశనగ పంటను వర్షం వల్ల కొట్టుకుపోతుంటే కాపాడుకోవడానికి నేలపై పడుకున్నట్లు కనిపిస్తుంది. మహారాష్ట్రలో ని వాషిమ్ జిల్లాలోని మనోరా తహసీల్‌లో అకాల వర్షాలు రైతులను నాశనం చేశాయి. అక్కడ భూముగ్, మూంగ్, చనా ,టూర్ వంటి పంటలు భారీ వర్షాలకు పూర్తిగా దెబ్బతిన్నాయి.కొన్నికల్లాల్లో ఉండగానే తడిసి ముద్దయ్యాయి. 

మరఠ్వాడ, పశ్చిమ మహారాష్ట్ర, విదర్భలోని వివిధ ప్రాంతాలలో భారీ వర్షాలు వ్యవసాయాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. మనోరా మార్కెట్ కమిటీ షేర్ చేసిన హృదయ విదారక వీడియోలు విస్తృత దృష్టిని ఆకర్షించాయి. వీటిలో రైతులు తడిసిన ధాన్యాన్ని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తుంది. వేరుశెనగ గింజలను కొట్టుకుపోకుండా వర్షంలోనే రైతు అడ్డంగా గమనించవచ్చు.ఆ క్షణం ప్రకృతి వైపరీత్యం కంటే ఎక్కువనిపిస్తుంది. ఇది రైతు వేదన, అతని పోరాటం,చెదిరిన అతని ఆకాంక్షలను ప్రతిబింబిస్తుంది. 

►ALSO READ | అమెజాన్, ఫ్లిప్ కార్ట్ డెలివరీ బాక్స్ పారేస్తున్నారా?.. జాగ్రత్త! మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావొచ్చు

ఈ సంఘటన మహారాష్ట్రలోని వాషిమ్ జిల్లా మనోరా మార్కెట్ కమిటీలో విక్రయించడానికి రైతులు వేరుశనగ, పెసలు, శనగలు ,కంది వంటి తమ పంటలను తీసుకువచ్చారు. గురువారం నాడు ఊహించని విధంగా కురిసిన వర్షం రైతులను నిండా ముంచింది. ధాన్యం పూర్తిగా తడిసిపోయింది నీటిలో కొట్టుకుపోయింది. ధాన్యాన్ని కాపాడుకోవడానికి మార్కెట్లో ఎలాంటి ఏర్పాట్ల లేవు. రైతులు చేతులు అడ్డం పెట్టి కాపాడుకోవడం తప్పా వేరే మార్గం లేదు. 

ఈ వీడియో కేవలం ఒక రైతు కథను మాత్రమే కాదు. ప్రతి సీజన్, ప్రతి సవాలు ,వివిధ వ్యవస్థల లోపాలతో పోరాడుతూ దేశాన్ని పోషించే లెక్కలేనన్ని రైతుల కథనాన్ని సూచిస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెట్టారు. రైతు సమస్యల పరిష్కారాన్ని కోరారు. సరియైన యంత్రాంగం లేకపోతే ప్రతి వర్షం తర్వాత కొంతమంది రైతులు తమ ఆశలు ఈ విధంగా మునిగిపోవడాన్ని చూడవలసి ఉంటుందని కామెంట్ చేశారు.