జడతో డబుల్ డెక్కర్ బస్సు లాగి గిన్నిస్ రికార్డ్

జడతో డబుల్ డెక్కర్ బస్సు లాగి గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ బుక్లో చోటు సంపాదించడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఆ లక్ష్యం సాధించేందుకు ఎంతో శ్రమించాలి. ఓపిక, పట్టుదలతో ముందుకెళ్లాలి. ఎంతో రిస్క్ చేస్తే గానీ అనుకున్న రికార్డును సాధించలేం. పంజాబ్కు చెందిన ఆశారాణి కూడా తన పేరు గిన్నిస్ బుక్ లో చూసుకునేందుకు ఎంతో కష్టపడింది. నిరంతరం శ్రమించి అనుకున్నది సాధించింది.
ఎవరైనా పొరపాటున జట్టు లాగితే నొప్పితో విలవిల్లాడిపోతాం. అలాంటిది ఆశారాణి మాత్రం ఏకంగా తన జడతో 12,216 కేజీల బరువైన డబుల్ డెక్కర్ బస్సును లాగి గిన్నిస్ రికార్డు సాధించింది. 2016లో ఆశారాణి ఈ రికార్డు సాధించగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు ఆమె కృషి, పట్టుదలను మెచ్చుకుంటున్నారు. అయితే ఆశా గిన్నిస్ రికార్డు సాధించడం అదే మొదటిసారి కాదు. ఆమె పేరు మీద మొత్తం 7 గిన్నిస్ రికార్డులు ఉన్నాయి. గతంలో ఆమె పళ్లతో 22.16 సెకండ్ల వ్యవధిలో కారును 25 మీటర్ల మేర లాగింది. 2013లో తన చెవులతో 1700కిలోల బరువైన వాహనాన్ని లాగి రికార్డు సృష్టించింది.

For more news..

బండి సంజయ్ బెయిల్ పై విచారణ

కరోనా పంజా.. ముంబైలో ఒక్కరోజే 10,860 కేసులు