కిటకిటలాడిన రాజన్న క్షేత్రం.. బారులు తీరిన భక్తులు

కిటకిటలాడిన రాజన్న క్షేత్రం.. బారులు తీరిన భక్తులు
వేములవాడ, వెలుగు: వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. ఉదయం అర్చకులు స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జీహెచ్ఎంసీ మేయర్  గద్వాల విజయలక్ష్మీ స్వామి, అమ్మవార్లను దర్శించుకుని  ప్రత్యేక పూజలు చేశారు. కోడె మొక్కు చెల్లించుకున్నారు. కల్యాణ మండపంలో వేద పండితులు, అర్చకుల ఆశీర్వచనాలు, ప్రసాదాన్ని అందజేశారు.