జడ్చర్లలో పేలుడు పదార్థాలు స్వాధీనం

జడ్చర్లలో పేలుడు పదార్థాలు స్వాధీనం

జడ్చర్ల టౌన్, వెలుగు: పట్టణంలో మరోసారి భారీగా పేలుడు పదర్థాలు పట్టుబడ్డాయి. పట్టణంలోని జయప్రకాశ్ నగర్ కాలనీ( చికూరి గుడిసెలు)లోని రూమ్ లో పేలుడు సామగ్రి ఉందనే పక్కా సమాచారంతో ఎస్బీ టీం, పోలీసులు దాడులు నిర్వహించారు. 11 బాక్స్ లలో 1,500 జిలెటిన్  స్టిక్స్, 300 డిటోనేటర్లు, వైర్లు పట్టుకుని స్టేషన్ కు తరలించ్చినట్లు సీఐ రమేశ్​బాబు తెలిపారు.

జనగామ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన ప్రశాంత్ కు చెందినవని, జిలెటిన్ స్టిక్స్ ను ఇక్కడ రాళ్లు పగలగొట్టేందుకు తెచ్చినట్లు తెలిసిందన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలాఉంటే జనవరిలో పట్టణంలోని ఇండస్ట్రియల్​ ఏరియాలో కూడా భారీగా జిలెటిన్​ స్టిక్స్​ పట్టుబడ్డాయి. అప్పుడు వాటిని తెచ్చిన నిందితుడికి ఈ ఘటనలో సంబంధం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.