నాగార్జున సాగర ప్రాజెక్టుకు భారీ వరద.. 24గేట్లు ఎత్తివేత

నాగార్జున సాగర ప్రాజెక్టుకు భారీ వరద.. 24గేట్లు ఎత్తివేత
  • నాగార్జునసాగర్ కు 5.80 లక్షల ఇన్​ప్లో..

హాలియా ,వెలుగు: శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్ కు భారీ వరద వచ్చి చేరుతోంది. ఎగువ నుంచి సాగర్​కు 5,81,628  క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వదులుతున్నారు. దీంతో డ్యామ్​ అధికారులు 24 గేట్లను 15 అడుగులు, 2 గేట్లను20 అడుగుల మేర ఎత్తి 531534 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

కాగా నాగార్జున సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు(312.0450 టీఎంసీలు) కాగా, ప్రస్తుతం 584.10 అడుగులు( 294.8385 టీఎంసీల) లకు చేరుకుంది. ఎడమకాల్వకు 6556 క్యూసెక్కులు, కుడి కాల్వకు 9533 క్యూసెక్కులు, హైదరాబాద్ జంట నగరాల తాగునీటి అవసరాలకు గాను ఏఎమ్మార్పి కి 1200 క్యూసెక్కులు, వరద కాల్వకు 300 క్యూసెక్కులు, విద్యుత్​ ఉత్పత్తి ద్వారా 32805 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు.