
ఉత్తర గాజాపై ఇజ్రాయెల్ శనివారం బాంబుల వర్షం కురిపించింది. గాజా ఉత్తర ప్రాంతంలో అల్ మఘాజీ శరణార్థుల శిబిరంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 30 మందిగాపైన ప్రాణాలు కోల్పోయారని హమాస్ తెలిపింది. చనిపోయిన పాలస్తీనియన్ల మృతదేహాలు, గాయాలతో ఉన్న వారికి ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతుందని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
షెల్లింగ్ జబాలియా శరణార్థి శిబిరంలని ప్రధాన నీటి వనరును ఇజ్రాయెల్ ధ్వంసం చేసింది. గత కొన్ని రోజులుగా పదే పదే దాడి చేస్తోంది. అక్టోబఱ్ 7 నుంచి గాజాపై ఇజ్రయెల్ జరిపిన దాడుల్లో 9, 488 మంది మృతిచెందారు.. ఇజ్రాయెల్లో 14 వందల మందికి పైగా మరణించారు.
మరోవైపు గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఆయా దేశాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా ఇండోనేషియ ప్రజలు మద్దతు తెలిపారు. పాలస్తీనియన్లకు మద్దతుగా ఆదివారం జకార్తాలో భారీ ర్యాలీ నిర్వహించారు.
జకార్తాలోని జాతీయ స్మారక చిహ్నం వద్ద గాజాలోని పాలస్తీనియన్లకు మద్దతుగా జరిగిన ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజలు ప్లకార్డులు , పాలస్తీనా జెండాలను ప్రదర్శించారు. గాజాపై బాంబు దాడిని ఆపండి అని ప్లకార్డు లు ప్రదర్శించారు.
Also Read :- కాల్పుల విరమించేది లేదు
మరోవైపు టెల్ అవీవ్ లో గాజాలో హమాస్ తీవ్రవాదుల చేత పట్టుబడిన బందీళను విడుదల చేయాలని నిరసనలు తెలిపారు. పసుపు రంగు కుర్చీలపై బందీలుగా ఉన్న 242 మంది వ్యక్తుల కళ్లను చూపిస్తూ నిరసనలు తెలిపారు.
బందీలుగా ఉన్న వారిలో 60 మంది గాజా స్ట్రిప్ పై ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడుల్లో మరణించారని హమాని సైనిక విభాగం కస్సామ్ బ్రిగేడ్స్ ప్రకటించారు.