ఉత్తరాఖండ్‌లో భారీ వ‌ర్షాలు

ఉత్తరాఖండ్‌లో భారీ వ‌ర్షాలు

న్యూఢిల్లీ : ఉత్తరాఖండ్‌లో భారీ వ‌ర్షాల వ‌ల్ల కొండ‌చ‌రియ‌లు విరిగిపడుతున్నాయి. తాజాగా కైలాస మాన‌స‌స‌రోవ‌రం యాత్రకు వెళ్లే రహదారిలో కొండ చరియలు విరిగిపడడంతో యాత్రికులు నిలిచిపోయారు. త‌వాఘాట్ జాతీయ ర‌హ‌దారి వ‌ద్ద సుమారు 40 మంది యాత్రికులు ఆగిపోయిన‌ట్లు అధికారులు వెల్లడించారు. న‌జాంగ్ తంబా గ్రామం వ‌ద్ద శుక్రవారం సాయంత్రం కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. భారీ వ‌ర్షాల వ‌ల్ల ఉత్తరాఖండ్‌లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.

చాలాచోట్ల ర‌హ‌దారులు స్తంభించిపోయాయి. రిషికేశ్‌-గంగోత్రి జాతీయ ర‌హ‌దారి కూడా బండ రాళ్లతో బ్లాక్ అయ్యింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.