గుజరాత్లో వరద బాధలు వర్ణనాతీతం

గుజరాత్లో వరద బాధలు వర్ణనాతీతం

భారీ వర్షాలు గుజరాత్ను ముంచెత్తుతున్నాయి. వరదలతో  గుజరాత్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆరావళి జిల్లాలో  భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వరదలతో స్థానిక ప్రజలు బాధలు వర్ణనాతీతం. స్థానికంగా వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక ఇండ్లలోకి వరదలు రావడంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్లలోకి మోకాళ్లలోతూ నీరు చేరింది. అటు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి.  

అటు దంగ్ జిల్లాలోని సపుతారాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గిరా జలపాతం పాలసంద్రాన్ని తలపిస్తోంది. పచ్చని అడవుల మధ్య ఉన్న ఈ జలపాతం  సుందరమైన దృశ్యాలు ఆకర్షిస్తున్నాయి.  వాఘాయి టవున్ కు  3 కిలో  మీటర్ల దూరంలో  ఉన్న ఈ జలపాతం... అంబిక నది లో పుడుతుంది. సుమారు 30 మీ. ల ఎత్తు నుండి నీరు కిందకు పడే దృశ్యాలను చూసేందుకు రెండు కళ్లు చాలవు.