మహబూబాబాద్, ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లో రోజంతా వాన..

మహబూబాబాద్, ములుగు, జయశంకర్భూపాలపల్లి జిల్లాల్లో  రోజంతా వాన..

ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా వర్షం కొనసాగుతోంది. శుక్రవారం రోజంతా కురవడంతో మహబూబాబాద్, ములుగు, జయశంకర్​భూపాలపల్లి జిల్లాల్లో పలు ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. కొత్తగూడ మండలం ఎంచగూడెం శివారులోని వీరేశం కుంటకు గండి పండింది. మహదేవపూర్​ మండలం బూరుగుగూడెం, సర్వాయిపేట మధ్యలో రోడ్డు సగం వరకు కొట్టుకుపోయింది.

 ​వెంకటాపూర్ మండలం వెలుతుర్లపల్లి శివారు మోరంచవాగు తెగిపోవడంతో రాకపోకలకు ఇబ్బందిగా మారింది. గ్రేటర్​ వరంగల్​ నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వరద చేరడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.  - వెలుగు, నెట్​వర్క్​