ముంబైలో మళ్లీ భారీ వర్షాలు

ముంబైలో మళ్లీ భారీ వర్షాలు

మహారాష్ట్రలో కుండపోతగా వర్షాలు పడుతున్నాయి. భివాండి జిల్లాలోని పలు ప్రాంతాలు నీట మునిగాయి. చాలా ఏరియాల్లోని ఇళ్లలోకి నీరు చేరటంతో.. జనం ఇబ్బందులు పడుతున్నారు. వీధులన్నీ చెరువులను తలపిస్తున్నాయి. మోకాళ్ల లోతు నీటిలో జనం అవస్థలు పడుతున్నారు. నిత్యవసర వస్తువులు దొరక ఇబ్బందులు పడుతున్నారు. కనుచూపు మేరలో ఎటు చూసినా వరదనీరే దర్శనమిస్తోంది. కార్లన్నీ పడవల్లా మారాయి. బైకులు నీటిపై తేలుతున్నాయి. బస్టాండ్ లోకి కూడా నీరు చేరింది. దీంతో.. సర్వీసులను నిలిపేశారు. పొలాలన్నీ.. వరదనీటితో నిండిపోయాయి. పంటలు మునిగిపోవడంతో.. రైతులు చాలా నష్టపోయారు. ముంబైలోనూ వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో.. అలలు ఎగిసిపడుతున్నాయి.