తుంగతుర్తి మండలలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం

తుంగతుర్తి మండలలో అకాల వర్షం.. తడిసిన ధాన్యం

తుంగతుర్తి, వెలుగు: వారం రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరి పంటలు కోసే సమయంలో రోజూ వర్షం పడుతోంది.  కోసి తీసుకొచ్చిన వరి ధాన్యం ఐకేపీ సహకార కేంద్రాల్లో తడిసి ముద్దవుతోంది. 

శనివారం సాయంత్రం తుంగతుర్తి మండల కేంద్రంలో ఈదురుగాలితో కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పూర్తిగా తడిసి ముద్దయింది. కోయని పంట పొలాలు ఈదురు గాలులకు నేలకొరిగాయి. దీంతో వరి రైతులు ఆందోళన చెందుతున్నారు.