వేములవాడలో దంచి కొట్టిన వాన

వేములవాడలో దంచి కొట్టిన వాన

వేములవాడ/వేములవాడరూరల్/కొడిమ్యాల, గన్నేరువరం, వెలుగు: వేములవాడ పట్టణంలో మంగళవారం ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఏకధాటిగా వాన పడడంతో భక్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పట్టణంలోని ప్రధాన రహదారులతో పాటు  ఆలయ పరిసరాలు, ప్రధాన రహదారులు జాతర గ్రౌండ్ లో రహదారిపై వరద నీరు చెరువును తలపించేలా ప్రవహించాయి. మూలవాగులో వరద ఉధృతి పెరిగింది. కొడిమ్యాల మండలంలో సుమారు రెండు గంటలపాటు వర్షం దంచి కొట్టింది.

దీంతో సూరంపేటకు వెళ్లే దారిలో దమ్మాయిపేట స్టేజి వద్దగల పోతారం వాగు పొంగిపొర్లడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. గన్నేరువరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆయుర్వేద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట భారీ వృక్షం నేలకొరిగింది.