భారీ వర్షాలు.. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

భారీ వర్షాలు.. మూడు జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

తెలంగాణతో పాటు..హైదరాబాద్ అంతటా భారీ వర్షం పడుతోంది.  అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఎక్కడికక్కడ జనజీవనం స్థంభించిపోయింది.  కాలనీలు జలదిగ్భంధం అయ్యాయి. బస్తీల్లో నదులు పారుతున్నాయి. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5వ తేదీన హైదరాబాద్ లోని అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా ప్రభుత్వ , ప్రైవేటు స్కూళ్లు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 5వ తేదీన స్కూళ్లన్నీ మూతపడనున్నాయి. 

హైదరాబాద్ తో పాటు...రంగారెడ్డి జిల్లా, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని అన్ని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనూ అర్థరాత్రి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ శివారు ప్రాంతాలు మొత్తం నీటమునిగాయి. కుండపోత వర్షానికి వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్ని గ్రామాలైతే జలదిగ్భంధం అయ్యాయి. ఈ క్రమంలోనే  ఈ జిల్లాల్లోని స్కూళ్లకు అధికారులు సెలవు ప్రకటించారు. ప్రభుత్వ , ప్రైవేటు స్కూళ్లన్నీ మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యాశాఖ ఆదేశాలను పాటించకపోతే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. 

టీచర్స్ డే..

సెప్టెంబర్ 5వ తేదీ టీచర్స్ డే. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు టీచర్స్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కల్చరల్ ఈవెంట్లకు ప్లాన్ చేశారు. అయితే భారీ వర్షాల నేపథ్యంలో ఈ కార్యక్రమాలన్నీ రద్దు అయ్యాయి. అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ఈ వర్షం ఇలాగే కొనసాగితే సెప్టెంబర్ 6వ తేదీ కూడా స్కూళ్లకు సెలవు పొడిగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.