కొండగట్టులో భక్తుల రద్దీ.. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని ప్రత్యేక పూజలు

కొండగట్టులో భక్తుల రద్దీ.. డిప్యూటీ సీఎం భట్టి భార్య నందిని ప్రత్యేక పూజలు

కొండగట్టు వెలుగు:  జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయంలో మంగళవారం భక్తుల రద్దీ నెలకొంది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అంజనను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.