బెంగళూరులో తొలి ఐకియా స్టోర్.. భారీ క్యూ

బెంగళూరులో తొలి  ఐకియా స్టోర్.. భారీ క్యూ

బెంగళూరులో తొలి ఐకియా స్టోర్ జూన్ 22న ప్రారంభమైంది. దీంతో దాన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు. క్యూ లైన్స్ లో జనం ఎంతగా బారులు తీరుతున్నారంటే.. లోపలికి వెళ్లేందుకూ దాదాపు 3 గంటలు పడుతోంది. దీన్నిబట్టి  స్టోర్ బయట జనం ఎంతపెద్ద సంఖ్యలో వేచి ఉంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. శనివారం ఒక్కరోజే దాదాపు 20వేల మంది స్టోర్కు వచ్చారని తెలుస్తోంది. దీంతో వినియోగదారులను అప్రమత్తం చేసేందుకు ఐకియా ఓ ట్వీట్ చేసింది. ‘‘ స్టోర్ లో ఫుల్ స్టాక్ ఉంది. కస్టమర్లు నెమ్మదిగా రావాలి’’ అని అందులో పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ఐకియాలో రద్దీపై నెటిజన్లు సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు. స్టోర్ వద్ద ప్రజలు గుమిగూడిన తీరుపై  ఫన్నీ వీడియోలు పెడుతున్నారు.  ‘‘మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన ఎమ్మెల్యేల క్యూ కాదిది’’ అని పేర్కొంటూ ఇంకొందరు సెటైర్లు వేస్తున్నారు.