టాలీవుడ్ నాకు ప్రాణంతో సమానం..నేనలా ఎందుకంటాను

టాలీవుడ్ నాకు ప్రాణంతో సమానం..నేనలా ఎందుకంటాను

టాలీవుడ్ ప్రేక్షకులపై తాను చేసిన వ్యాఖ్యలపై బుట్టబొమ్మ స్పందించింది. నేను మాట్లాడిన మాటలకు వేరే అర్ధం వచ్చేలా ఆపాదించడం కరెక్ట్ కాదన్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న బుట్టబొమ్మ పూజా హెగ్డే  ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.   ఇంటర్వ్యూలో అల వైకుటంఠపురంలో హీరో కాళ్లు చూసే సీన్ పై చర్చ జరిగింది. ఆ సందర్భంగా పూజా హెగ్డే మాట్లాడుతూ టాలీవుడ్ ప్రేక్షకులకు నడుం భాగం అంటే పిచ్చి అనే తరహా వ్యాఖ్యలు చేసింది. నాకైతే ఎవరైనా నా కాళ్లు చూస్తే బావుణ్ణు అనుకుంటాను కానీ నడుం కాదంటూ మాట్లాడింది. అయితే ఈ వ్యాఖ్యలపై టాలీవుడ్ సినీప్రియులతో పాటు నెటిజన్లు బుట్టబొమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

దీంతో ఈ వ్యాఖ్యలపై పూజా హెగ్డే స్పందించింది. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పులు లేవని చెప్పింది. అక్ష‌రాన్ని మార్చ‌గ‌ల‌రేమో కానీ అభిమానాన్ని కాద‌ంటూ..టాలీవుడ్ అంటే తనకు ప్రాణమని పూజా హెగ్డే క్లారిటీ ఇచ్చింది.