
మేజర్ క్రికెట్ లీగ్ లో భాగంగా సియాటిల్ ఓర్కాస్ జట్టులో రెండు పెద్ద మార్పులు చోటు చేసుకున్నాయి. వరుస పరాజయాలతో జట్టును నడిపించలేకపోతున్న హెన్రిచ్ క్లాసన్ తన కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. మేజర్ లీగ్ టోర్నీలో క్లాసన్ కెప్టెన్సీలో ఐదు మ్యాచ్ లు ఆడితే ఆ జట్టు ఐదు ఓడిపోయింది. దీంతో కెప్టెన్సీ భారాన్ని తాను మోయలేనని శనివారం (జూన్ 28) ఎంఐ మ్యాచ్ కు ముందు సారధ్య బాధ్యతల నుండి వైదొలిగాడు. క్లాసన్ స్థానంలో జింబాబ్వే ఆల్ రౌండర్ సికిందర్ రజా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు.
క్లాసన్ తన బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టడానికి కెప్టెన్సీని వదులుకోవాలని నిర్ణయించుకున్నాడు. రజా ఈ టోర్నీలో మిగిలిన మ్యాచ్ లకు కెప్టెన్సీ చేస్తాడు. ప్రధాన కోచ్ మాథ్యూ మోట్ ను మ్యాచ్ మధ్యలోనే తన తొలగించడం జరిగింది. "మాథ్యూ తన పదవీకాలంలో చూపిన నిబద్ధత.. వృత్తి నైపుణ్యానికి మేము కృతజ్ఞులం. అతని భవిష్యత్తుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము." అని సియాటిల్ ఓర్కాస్ సీఈఓ హేమంత్ దువా చెప్పుకొచ్చాడు.
క్లాసన్ గురించి మాట్లాడుతూ.. "హెన్రిచ్ తన బ్యాటింగ్ పై దృష్టి పెట్టడానికి కెప్టెన్సీ నుంచి వైదొలగాలని తీసుకున్న నిర్ణయాన్ని మేము పూర్తిగా గౌరవిస్తాము. ఇది అతని వ్యక్తిత్వాన్ని.. జట్టు పట్ల అతని నిబద్ధతను తెలియజేస్తుంది. క్లాసెన్ నిర్ణయం గురించి తెలుసుకున్న తర్వాత, సికందర్ మా ప్రధాన ఎంపిక. ఈ మార్పులు సీజన్‌కు బలమైన ముగింపుకు పునాది వేస్తాయని మేము నమ్ముతున్నాము," అని ఆయన తెలిపాడు. వీరిద్దరూ తమ పదవుల నుంచి తప్పుకొన్న తర్వాత సియాటిల్ ఓర్కాస్ తొలి విజయాన్ని అందుకోవడం విశేషం.
శనివారం (జూన్ 28) డల్లాస్ వేదికగా గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో ఎంఐ న్యూయార్క్ పై సియాటిల్ ఓర్కాస్ ఉత్కంఠ విజయాన్ని అందుకుంది. సియాటిల్ ఫినిషర్ హెట్మెయర్(40 బంతుల్లో 97: 5 ఫోర్లు, 9 సిక్సర్లు) మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ తో ఓర్కాస్ జట్టును గెలిపించాడు.మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ న్యూయార్క్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 237 పరుగులు భారీ స్కోర్ చేసింది.
పూరన్ (60 బంతుల్లో 108: 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీతో చెలరేగితే తజిందర్ ధిల్లాన్(35 బంతుల్లో 95: 8 ఫోర్లు, 8 సిక్సర్లు) అంతకు మించిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య ఛేదనలో సియాటిల్ ఓర్కాస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసి చివరి బంతికి గెలిచింది. హెట్మెయర్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Seattle Orcas has undergone a significant leadership shake-up in the ongoing Major League Cricket (MLC) season.
— Caught & Bowled (@caught1bowled) June 28, 2025
Head Coach Matthew Mott has been sacked.
Heinrich Klaasen has stepped down from the captaincy.
Sikandar Raza has been appointed as the new captain pic.twitter.com/O7DWtE2xZ9