కరీంనగర్ టౌన్,వెలుగు: డబుల్ బెడ్రూం, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ ఎదుట మంగళవారం హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు.
ఏవైనా సమస్యలు ఉంటే ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్ డెస్క్ లో సంప్రదించాలని ప్రజలకు సూచించారు. కలెక్టరేట్ ఏవో సుధాకర్, గృహ నిర్మాణశాఖ అధికారులు పాల్గొన్నారు.
