
లక్ష్ లాల్వానీ (Lakshya) హీరోగా నిఖిల్ నగశ్ భట్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’(Kill). తాన్యా మనక్తిలా (Tanya Maniktala)హీరోయిన్గా నటించింది. జులై 5న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా యాక్షన్ ప్రియులు ఇందులో స్టంట్స్‌కు ఫిదా అవ్వాల్సిందే.
కిల్ ఓటీటీ:
కల్కి 2898 ఏడీ మూవీకి హిందీ బెల్ట్ లో గట్టి పోటీ ఇచ్చిన ‘కిల్ మూవీ..ఇప్పుడు ఓటీటీలో అడుగుపెట్టబోతోంది. ఈ సినిమా సెప్టెంబర్ 6 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. "ఈ ప్రయాణం మొత్తం రక్తపాతంతో నిండిపోనుంది. మేము వచ్చేస్తున్నాం. కిల్ మూవీ సెప్టెంబర్ 6 నుంచి మీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో" అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు వెల్లడించింది.
ALSO READ | UdvegamTeaser: కోర్టు రూమ్‌లో ఉద్వేగం..టీజర్ రిలీజ్ చేసిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ
హిందీలో స్ట్రీమింగ్ కానున్న ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో వస్తుందా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కిల్ సినిమా యాక్షన్ మొత్తం రైల్‍లోనే ఉంటుంది. గతేడాది రణబీర్ కపూర్ నటించిన యానిమల్ కంటే కూడా వయోలెంట్ మూవీ అన్న రివ్యూలు వచ్చాయి.
This ride is about to get bloody! ?
— Disney+ Hotstar (@DisneyPlusHS) August 30, 2024
We are coming, #Kill streaming on Sept 6.#KillOnHotstar #KILLMovie pic.twitter.com/u2whn1LbR0
కథేంటి?
అమిత్ రాథోడ్ (లక్ష్య లల్వానీ) ఆర్మీలో ఎన్ఎస్‌జీ కమాండర్. తులికా (తన్య మనిక్తలా) అనే అమ్మాయితో ప్రేమలో ఉంటాడు. ప్రేయసి మరొకరితో నిశ్చితార్థం చేసుకుని రాంచీ నుంచి ఫ్యామిలీతో కలిసి ట్రైన్‌లో ఢిల్లీ వెళ్తుంటుంది. ఆమెని సర్‌ప్రైజ్ చేద్దామని హీరో కూడా అదే ట్రైన్ ఎక్కుతాడు. ఓ స్టేషన్‌లో ఇదే ట్రైన్‌లోకి 40 మంది బందిపోట్లు ఎక్కుతారు. వీళ్ల వల్ల తులికా కుటుంబానికి ఊహించని చిక్కులు! తర్వాత ఏమైంది? మరి ఎన్‌ఎస్‌జీ కమాండో అయిన అమిత్ బందిపోట్లను ఎలా ఎదుర్కొన్నాడు? తులికా ఫ్యామిలీతో పాటు మిగతా ప్రయాణికులను ఎలా కాపాడాడు? అనేది స్టోరీ.