పోషకాల గని పన్నీర్ పై ..హెరిటేజ్ అవగాహన

పోషకాల గని పన్నీర్ పై ..హెరిటేజ్ అవగాహన

హైదరాబాద్​, వెలుగు: శరీరానికి పోషకాలను అందించే పన్నీర్​ గురించి తెలియజేయడానికి  ప్రత్యేక ప్రచార కార్యక్రమం ప్రారంభించినట్టు డెయిరీ కంపెనీ హెరిటేజ్ ఫుడ్స్ ప్రకటించింది. ఇందుకోసం "ఎవ్రీ డే యమ్మీ విత్​హెరిటేజ్​ పన్నీర్" అనే క్యాంపెయిన్​ను నిర్వహిస్తున్నామని తెలిపింది. ఈ ఏడాది డిసెంబర్  వరకు ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్  బెంగళూరులలో ఈ కార్యక్రమం జరుగుతుంది. 

ఫుడ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లుయెన్సర్ భార్గవి ('అమ్మ చేతి వంట' ఫేమ్) ఈ ప్రచారానికి నాయకత్వం వహిస్తారు. పన్నీర్‌‌‌‌‌‌‌‌ను ఉపయోగించి వంటకాలు తయారుచేసి, వాటిని హెరిటేజ్​ఫుడ్స్​ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో అప్‌‌‌‌‌‌‌‌లోడ్ చేయడం ద్వారా ఈ మల్టీ-సిటీ పోటీలో పాల్గొనవచ్చు.  విజేతకు బహుమతిగా 10 గ్రాముల 22-క్యారెట్ల బంగారు నాణెం ఇస్తారు. విజేతలు,  రన్నరప్‌‌‌‌‌‌‌‌లు  ఈ ఏడాది డిసెంబర్ మధ్యలో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లో జరిగే భార్గవి కుకింగ్ మాస్టర్‌‌‌‌‌‌‌‌క్లాస్‌‌‌‌‌‌‌‌కు హాజరు కావొచ్చు.