Hero Bikes Export: హీరో బైక్ ఎగుమతులు 74.52 శాతం పెరిగాయి

Hero Bikes Export: హీరో బైక్ ఎగుమతులు 74.52 శాతం పెరిగాయి

భారత్ కు చెందిన మోటార్ బైక్ తయారీ కంపెనీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా తమ ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్నాయి. చాలా కంపెనీలు ప్రపంచానికి వివిధ రకాల బైకులను ఎగుమతి చేస్తున్నాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా భారతీయ మోటార్ బైక్ లకు మంచి డిమాండ్ ఉంది. ఇటీవల భారత్ కు చెందిన పలు మోటార్ బైక్ కంపెనీలు చేసిన ఎగుమతుల్లో పెరుగుదలే ఈ డిమాండ్ ను చూపిస్తోంది. 2024 జనవరి లో హీరో మోటో కార్ప్ బైక్ ల ఎగుమతులు 74.52 శాతం పెరిగాయి. జనవరి నెలలో 12,658 యూనిట్ల మోటార్ బైక్లను హీరో కంపెనీ ఎగుమతి చేసింది. 2023 ఇదే నెలలో హీరో కంపెనీ కేవలం 7,253 యూనిట్లను మాత్రమే ఎగుమతి చేసింది. 

ALSO READ :- బెస్ట్ ఆఫర్: రూ. 17వేల 5G స్మార్ ఫోన్ 10 వేలకే

హీరో ఎగుమతుల్లో హీరో హెచ్ఎఫ్ డీలక్స్ కు అత్యధిక డిమాండ్ ఉంది. జనవరి 2023లో కేవలం 2,448 యూనిట్ల ను ఎగుమతి చేసిన కంపెనీ.. 2024 జనవరిలో దాదాపు 90 శాతం పెరిగి 4,638 యూనిట్లను పెరిగింది. Hero HF డీలక్స్ ప్రస్తుతం కంపెనీ అత్యధికంగా ఎగుమతి చేయబడిన మోటార్ సైకిల్. బైక్ ఎగుమతుల్లో 36.64 శాతం వాటాను కలిగి ఉంది. జనవరి 2024 లో హీరో హంక్ ఎగుమతి 116.13 శాతం పెరిగింది. అదే సమయంలో స్ప్లెండర్ ఎగుమతులు 13.64 శాతం క్షీణించాయి.హీరో గ్లామర్ విక్రయాలు 140.18 శాతం పెరిగాయి. XPulse 200 అమ్మకాలు 55.72 శాతం పెరిగాయి.