కొద్దిమంది అతిథుల మధ్య రానా కళ్యాణం

కొద్దిమంది అతిథుల మధ్య రానా కళ్యాణం

యువహీరో దగ్గుబాటి రానా వివాహం మిహీకతో శనివారం గ్రాండ్‌ గా జరిగింది. ఇరు కుటుంబాలకు చెందిన అతి కొద్దిమంది అతిథుల మధ్య మూడుముళ్ల బంధంతో ఈ ప్రేమజంట ఒక్కటయ్యారు. టాలీవుడ్ మొదలు బాలీవుడ్ వరకు పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా కొత్త జంటకి విషెస్ చెప్పారు. పెళ్లితో పాటు అంతకు ముందు జరిగిన హల్దీ, మెహెందీ వేడుకలకు సంబంధించిన ఫొటోస్ నెట్‌లో సందడి చేస్తున్నాయి. ముఖ్యంగా తండ్రి సురేష్ బాబు, బాబాయి వెంకటేష్‌లతో కలిసి రానా ట్రెడిషనల్ డ్రెస్‌లో ఉన్న ఫొటోస్ హైలైట్ గా నిలిచాయి.