క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని కలిసిన మహేష్

క్యాన్సర్ తో బాధపడుతున్న చిన్నారిని కలిసిన మహేష్

ప్రిన్స్ మహేష్ బాబు మరోసారి మంచి మనసు చాటుకున్నాడు. క్యాన్సర్ తో బాధపడుతున్న బాలిక కోరికను తీర్చాడు. శ్రీకాకుళానికి చెందిన పర్విన్ బేబీ అనే చిన్నారికి మహేష్ బాబు అంటే అభిమానం. అయితే ఆమె ప్రస్తుతం క్యాన్సర్ తో బాధపడుతుంది. తన చిరకాల ఆకాంక్ష తాను ఎంతో ఇష్టపడే హీరో మహేష్ బాబును చూడాలని తన తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయాన్ని మహేష్ అభిమాన సంఘం ద్వారా మహేష్ కి తెలియడంతో వెంటనే మహేష్ అందుకు ఓకే చెప్పాడు.

శనివారం శ్రీకాకాళంలోని చిన్నారి ఇంటికి వెళ్లి కలిశాడు. చిన్నారితో ఫోటోలు దిగాడు. ఆరోగ్యం జాగ్రత్త అంటూ కాసేపు మాట్లాడాడు మహేష్. ప్రిన్స్ రాకతో బాలిక తల్లిదండ్రులు సంతోష పడ్డారు. తన బిడ్డ ఆకాంక్షను తీర్చిన మహేష్ కి థాక్స్ చెప్పారు.  ప్రస్తుతం మహేష్ బాబు మహార్షి సినిమాలో నటిస్తున్నాడు.