నాగశౌర్య పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్

నాగశౌర్య పెళ్లి సందడి.. ఫొటోలు వైరల్

హీరో నాగశౌర్య వివాహం బెంగళూరులో వైభవంగా జరిగింది. ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి మెడలో మూడు ముళ్లు వేసి ఎట్టకేలకు నాగశౌర్య ఓ ఇంటివాడయ్యాడు. బెంగళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబాల పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు నూతన వధూవరులకు అభినందనలు చెబుతున్నారు.

అంతకుముందు బెంగళూరులో హల్దీ, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ వేడుకలో నాగశౌర్య  తనకు కాబోయే సతీమణి అనూష వేలికి ఉంగరం తొడిగాడు. కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకలకు సంబంధించిన  ఫొటోలు సైతం నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి.