మీడియా లేకపోయుంటే నిజం ఎప్పుడో చచ్చిపోయేదని, మీడియాపై నాకెలాంటి కోపం లేదని, నాపై వచ్చిన తప్పుడు వార్తలను మాత్రమే నేను ఖండించానని చెప్పుకొచ్చాడు టాలీవుడ్ యంగ్ హీరో నవదీప్. ఆయన ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ వెబ్ సిరీస్ న్యూసెన్స్. ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని నిర్మించాయి. బిందు మాధవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సిరీస్.. మే 12 నుండి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.
ఇక ప్రమోషన్స్ లో బాగంగా.. తాజాగా సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసిన మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నవదీప్ మాట్లాడుతూ.. ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నారు. అదేంటంటే.. మీడియా అంటే మీకు ఎందుకు అంత కోపం అని. నిజానికి మీడియాపై నాకెలాంటి కోపం లేదు.. నాపై తప్పు వార్తలు వచ్చినప్పుడు మాత్రం కండించాను అంతే. కానీ నేను కూడా కొన్ని సార్లు తప్పులు చేశాను. - డ్రంకెన్ డ్రైవ్ చేయడం తప్పు, అందుకే అది అందరిముందు ఓపెన్ గానే ఒప్పుకున్నాను. కానీ.. ఫార్మ్ హౌస్ విషయంలో కావాలనే కొంచెం హార్ష్ గా బెహేవ్ చేసానని చెపుకొచ్చాడు నవదీప్.
అయితే.. ఇలాంటి ఫెక్ న్యూస్ సోషల్ మీడియాలోనే ఎక్కువగా కనిపిస్తాయి. వాటి వల్ల మెయిన్ స్ట్రీమ్ మీడియాపై కూడా కోప్పడాల్సి వచ్చింది. అంతేగాని మీడియాపై నాకు ఎలాంటి కోపమేంలేదన్నారు. ఏదో కుర్రాతనం లో అలా జరిగిపోయిందని, కానీ.. ఇప్పుడు పూర్తిగా మారిపోయానన్నారు నవదీప్. ఈ సందర్భంగా డ్రగ్స్ కేసులో తన పేరు వినిపించడాన్ని కూడా ప్రస్తావించాడు నవదీప్. నాకు ఫుడ్ & బేవరేజెస్ బిజినెస్ ఉంది కాబట్టి.. హోటల్, రెస్టారెంట్, ఈవెంట్ఆర్గనిజర్స్ తో నేను, మా టీం టచ్ లో ఉంటాము. అందుకే నా పేరు వచ్చింది అని క్లారిటీ ఇచ్చాడు. ఇక న్యూసెన్స్ వెబ్ సిరీస్ అందరికీ నచ్చుతుందని, వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కిందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ఈవెంట్ లో నటి బిందు మాధవి, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్, నిర్మాత వివేక్ తో పాటు బొమ్మరిల్లు భాస్కర్ కూడా పాల్గొన్నాడు.